Viral Video: బైకుపై వేగంగా వెళ్తుండగా అడ్డువచ్చిన పులి.. వీడియో వైరల్

ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఒక్కసారిగా వారి ముందుకు పులి వచ్చింది. దీంతో షాకైన ఆ యువకులు బైకును వెనక్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారిని పులి వెంటాడితే ప్రాణాలు పోయేవి. బైకు ముందుకు పులి వచ్చిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Viral Video: బైకుపై వేగంగా వెళ్తుండగా అడ్డువచ్చిన పులి.. వీడియో వైరల్

Viral Video: ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఒక్కసారిగా వారి ముందుకు పులి వచ్చింది. దీంతో షాకైన ఆ యువకులు బైకును వెనక్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారిని పులి వెంటాడితే ప్రాణాలు పోయేవి. బైకు ముందుకు పులి వచ్చిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వన్య మృగాలు తిరిగే చోట వాహనాలను తక్కువ వేగంతో నడపాలని అన్నారు. మొదట అటవీ ప్రాంత సమీపంలో ఉన్న రోడ్డుపై వెళ్తున్న ఓ కారు పులిని గమనించి ఆగింది. అయితే, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు మాత్రం ఆ పులి వస్తుందన్న విషయాన్ని గుర్తించకుండా అధిక వేగంతో వెళ్లారు.

చెట్ల చాటు నుంచి రోడ్డుపైకి ఒక్కసారిగా పులి వచ్చింది. వెంటనే బైకు బ్రేక్ వేసిన యువకులు తర్వాత ఆ ద్విచక్ర వాహనాన్ని వెనక్కి తీసుకు వెళ్లారు. వారిని చూసిన పులి ఏ హానీ తలపెట్టకుండా వెళ్లిపోయింది. ఆ పులి ఆ యువకులపై దాడి చేస్తే వారు ప్రాణాలు కోల్పోయేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని రోడ్లపై వెళ్లే సమయంలో వేగంగా వెళ్లకూడదని సూచిస్తున్నారు.

Delhi Mayor: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆప్ .. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌