ఎండలు చంపేస్తున్నాయ్ : వడదెబ్బకు ఇద్దరు మృతి

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 01:32 AM IST
ఎండలు చంపేస్తున్నాయ్ : వడదెబ్బకు ఇద్దరు మృతి

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉంటోంది. అక్కడక్కడ వేడి గాలులు వీస్తున్నాయి.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కోస్తాలో 35 నుంచి 37 డిగ్రీల వరకు, రాయలసీమలో 37 నుంచి 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పశ్చిమ ఆటంకాల ప్రభావంతో ఉత్తర దిశ నుంచి కొనసాగుతున్న గాలులకు మధ్యాహ్నం సముద్రం నుంచి తేమ గాలులు కలవడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసు కుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
Also Read : నిఖా పేరుతో దోపిడీ : లక్షలు ముంచేసిన నైజీరియన్

వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చి మొదటివారంలోనే ఇలా ఉంటే మే నెలలో ఎండ తీవ్రత ఎంత ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ వేసవి సీజన్‌లో ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ కేంద్ర అధికారులు చేసిన హెచ్చరికలు కూడా ఆందోళన నింపాయి.  కర్నూలు జిల్లా నంద్యాలలో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదయ్యాయి.

అప్పుడే వడదెబ్బ ప్రభావం చూపుతోంది. కర్నూలు జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు చనిపోయారు. మార్చి 3న చాగలమర్రి మండలం ఇ-ముత్యాలపాడుకు చెందిన సాజియా(8), మార్చి 4న పాణ్యం మండల కేంద్రానికి చెందిన రైతు రామసుబ్బయ్య (38)లు వడదెబ్బకు మృతి చెందారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండలు అధికమయ్యాయి.  
Also Read : ముంచేశాడు : మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం

కర్నూలు, ఆదోనిలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే నంద్యాలలో అత్యధికంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ ఎక్కువగా నల్ల రేగడి భూములు ఉండడమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భూముల స్వభావం ప్రకారం నిదానంగా వేడెక్కి సాయంత్రం ఆలస్యంగా వేడి తగ్గుతుంది.