Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

సోమవారం వేకువఝామున నాలుగు గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. టర్కీలోని దియర్బకిర్, అదానా, గాజియాంటెప్ ప్రాంతాల్లో, సిరియాలోని అలెప్పో, లతాకియా, హామా, టార్టస్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది.

Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

Turkey Earthquake: తుర్కియె (టర్కీ), సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం వల్ల భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,300 మంది మరణించి ఉంటారని తాజా అంచనా. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Telangana Budget 2023: ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ .. బడ్జెట్‌లో రూ. 7,890 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

సోమవారం వేకువఝామున నాలుగు గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. ప్రజలంతా నిద్ర మత్తులో ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. టర్కీలోని దియర్బకిర్, అదానా, గాజియాంటెప్ ప్రాంతాల్లో, సిరియాలోని అలెప్పో, లతాకియా, హామా, టార్టస్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని ఇండ్లు, భవనాలు నేలకూలాయి. అక్కడి విపత్తు నిర్వహణ బృందాలు బాధితుల్ని రక్షించేందుకు సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భూకంప ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

Delhi Mayor Poll: మూడోసారి వాయిదాపడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఆప్

మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ నేపథ్యంలో టర్కీకి సహాయం అందించాలని భారత్ నిర్ణయించింది. దీని ప్రకారం… టర్కీకి భారత విపత్తు నిర్వహణ, సహాయ బృందాల్ని పంపించాలని నిర్ణయించింది. సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి కూడా ఇండియా అందించనుంది. అవసరమైన అన్ని రకాల సహాయాల్ని టర్కీకి అందిస్తామని భారత్ ప్రకటించింది. వైద్య సిబ్బంది, విపత్తు నిర్వహణా బృందాలు సహా దాదాపు వంద మందికిపైగా సిబ్బంది టర్కీ వెళ్లనున్నారు. శిక్షణ పొందిన కొన్ని శునకాల్ని కూడా పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.