Ayyanna Patrudu : దొంగలకు ఓటు వేయద్దు.. ఓటర్లకు మాజీ మంత్రి విజ్ఞప్తి

విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్‌ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం..

Ayyanna Patrudu : దొంగలకు ఓటు వేయద్దు.. ఓటర్లకు మాజీ మంత్రి విజ్ఞప్తి

Ayyanna Patrudu

Ayyanna Patrudu : ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, దయచేసి దొంగలకు ఓటు వేయద్దని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. విశాఖ జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున అంబేద్కర్ విగ్రహం నుంచి టీడీపీ నిర్వహించిన ర్యాలీలో అయ్యన్న పాల్గొన్నారు. అధికార పార్టీపై అయ్యన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.

SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు

విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్‌ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అరెస్టులు చేయిస్తావా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.

జీవీఎంసీ 31వ వార్డు ఉపఎన్నికలో భాగంగా టీడీపీ ప్రచారం చివరి రోజు చేరుకుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎల్లమ్మ తోట వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!

” దొంగలకు ఓటు ఎందుకు వేయాలి? రాష్ట్రాని అప్పుల పాలు చేసిన ఘనత జగన్ ది. ఇసుక, మద్యం విధానాల్లో రాష్ట్రంలో భారీగా అవినీతి జరుగుతోంది. విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తనఖా పెట్టారు. ఈరోజు ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రైవేట్ పరం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడింది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తారా? ప్రజలు ఆలోచించి ఓటు వేయండి. దయ చేసి దొంగలకు ఓటు వేయద్దు” అని అయ్యన్న పాత్రుడు అన్నారు.