NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్...
NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతకొంత కాలంగా సక్సెస్ లేక సతమతమైన బాలయ్య, అఖండ చిత్రంతో అదిరిపోయే రేంజ్లో సక్సెస్ అందుకున్నాడు.
NBK107: బాలయ్య కొత్త షెడ్యూల్లో ఏం చేస్తున్నాడంటే?
ఇక ఆ సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రంలోనూ అఖండ చిత్రానికి సంబంధించిన ఓ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాడట. నిజానికి గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టులో లేని రెండు కొత్త సీన్స్‌ను ఇప్పుడు బాలయ్య కోసం ప్రత్యేకించి యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సీన్స్ కూడా హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే సీన్స్గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
NBK107: అఖండ నుండి ‘అన్నగారు’గా మారుతున్న బాలయ్య..?
సాధారణంగానే బాలయ్య సినిమాల్లో హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే సీన్స్ ఖచ్చితంగా ఉండేలా చూస్తారు. అయితే అఖండ సినిమాలో ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువగానే పండింది. దీంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని బాలయ్య కోరాడట. దీంతో గోపీచంద్ మలినేని, అసలు కథలో లేని రెండు కొత్త సీన్స్‌ను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథలో బాలయ్య చెలరేగిపోయి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా, థమన్ మరోసారి బాలయ్య చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.