ఫ్యామిలీ అంతా క్వారంటైన్ లో ఉండగా..ఇల్లు దోచేసిన దొంగలు

ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్ లో ఉంది. ఇదే అదనుగా భావించిన దొంగలు మొత్తం ఇంటిని దోచుకుపోయిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. క్వారంటైన్ పూర్తయ్యాక ఇంటికివచ్చి చూసేసరికి మొత్తం ఇంటిని చక్కబెట్టారని తెలుసుకుని సదరు బాధిత కుటుంబం బావురుమంది.
ఇండోర్ లోని ఇమ్లీ బజార్ లో ఓ షాపు నడుపుతున్న వ్యక్తి కుటుంబంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండటంతో అధికారులు సదరు కుటుంబాన్ని మొత్తం ఏప్రిల్ 6న క్వారంటైన్ కు తరలించారు. అలా ఏప్రిల్ 22న క్వారంటైన్ పూర్తయ్యాక ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంకేముంది? మొత్తం సర్దేశార దొంగలు. ఇంట్లోని విలువైన వస్తువులు..బంగారం..మొత్తం రూ. 12 లక్షలు విలువైన సొత్తు చోరీకి గురైనట్టు గుర్తించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు దర్యాప్తు సరిగా చేయటంలేదని..పోలీసులు అస్సలు తమ ఇంటికి వచ్చి చూడలేదనీ..కారణం తమ కరోనా లక్షణాలతో క్వారంటైన్ కు వెళ్లటమేనని ఆరోపిస్తు..ఆ కుటుంబం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ట్వీట్ చేసింది.
పోలీసులు మాత్రం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని, దర్యాప్తు నత్తనడకన సాగుతోందనడంలో ఏమాత్రం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సునీల్ శర్మ వాస్తవం కాదని కొట్టిపారేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే… సదరు వ్యాపారి కుటుంబం క్వారంటైన్ నుంచి ఏప్రిల్ 26న ఇంటికి రాగా, ఆ తర్వాత వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు.
Read Here>> కరోనాతో పోరాడి గెలిచి బిడ్డకు జన్మ