Ponnam Prabhakar: సంజయ్ ఓసారి ఆస్పత్రిలో చూపించుకో.. కవిత కోసం సిద్ధంచేసిన జైలు రూం ఏమైందో చెప్పు..

కాంగ్రెస్ పార్టీ సీట్ల గురించి నువ్వు మాట్లాడుతావా? సంజయ్ నీకు బుద్ది ఉందా? ఓ సారి ఆస్పత్రిలో చూపించుకో.. అంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponnam Prabhakar: సంజయ్ ఓసారి ఆస్పత్రిలో చూపించుకో.. కవిత కోసం సిద్ధంచేసిన జైలు రూం ఏమైందో చెప్పు..

Ponnam Prabakar Reddy

TS Congress Leader: కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ (Bandi Sanjay) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులనుకూడా కేసీఆరే (KCR) డిసైడ్ చేస్తాడని, 30మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారంటూ వ్యాఖ్యానించారు. సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ సీట్ల గురించి తర్వాత ముందు నువ్వు ఒకసారి ఆస్పత్రిలో చూపించుకో సంజయ్ అంటూ పొన్నం సూచించారు. కవితను అరెస్టు చేయడం ఖాయమని చెప్పావ్.. జైలులో కవితకోసం రూంకూడా రెడీ అయిందని చెప్పావ్.. ఏమైంది సంజయ్.. కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ పొన్నం ప్రశ్నించారు.

Bandi Sanjay : కాంగ్రెస్ లో గెలిచినవారు బీఆర్ఎస్ లో చేరుతారు.. 30 సీట్లను డిసైడ్ చేసేది కేసీఆరే : బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ సీట్ల గురించి నువ్వు మాట్లాడుతావా? సంజయ్ నీకు బుద్ది ఉందా? ఓ సారి ఆస్పత్రిలో చూపించుకో.. నీ పాదయాత్ర వెనుక కేసీఆర్ లేడా? బీజేపీకి హైప్ తేవడానికి నిన్ను అరెస్టులు చేయలేదా? ఈటెల రాజేందర్‌ను డౌన్ చేయడానికే.. కేసీఆర్ నిన్న టార్గెట్ చేయలేదా? అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీని లేపే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. సంజయ్ రాష్ట్రంలో ఓ జోకర్ లా మారారని, పార్లమెంట్ పరిధిలో ఎన్నో సమస్యలు ఉన్నా కనీసం పట్టించుకున్నారా? అని సంజయ్‌ను ప్రశ్నించారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరూ స్నేహపూర్వకంగా మెలుగుతున్నారని, మీ ఇద్దరూ ఒక్కటి కాదా..? అని పొన్నం ప్రశ్నించారు.

Bandi Sanjay Kumar : బీజేపీ ప్రభుత్వం వచ్చినా.. ధరణిని రద్దు చేయము, కానీ- బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బహిరంగ స్వాగతం పలుకుతున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.