Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం

అనుచరులతో ఈటల సమావేశం..పార్టీ మారుతున్నారనే ప్రచారం..ఆయన మౌనం దేనికి సంకేతమిస్తోంది..? హాట్ టాపిక్ గా ఈటల సమావేశం..

Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం

BJP Etala Rajender

BJP Etala Rajender : బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఈటల పాల్గొనకపోవటంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల ఈటల ఢిల్లీ వెళ్లటం అధిష్టానం ఆయనకు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఈక్రమంలో ఇటీవల మరి ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీ వెళ్లినప్పటినుంచి మౌనంగా ఉంటున్నారు.

ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం పేరుతో నిర్వహించే కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. ఒకే రోజు 35లక్షల కుటుంబాలను కలిసేలా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపట్టారు. కానీ ఈటల మాత్రం పాల్గొనలేదు. కానీ ఈటల తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.ఇది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో యాక్టివ్ గా లేకపోవటం..కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పార్టీ మారతారనే వార్తలు వస్తున్న సమయంలో అనుచరులతో సమావేశం, చర్చలు చేయటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Etala Rajender – Komatireddy : ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి దూరంగా.. ఈటల, కోమటిరెడ్డితోపాటు పలువురు సీనియర్లు

బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందని ఆయన అనుచరులు సూచించినట్లుగా పక్కా సమాచారం. కమలం పార్టీలో ఉంటే అనుకున్నది సాధించలేమని కాంగ్రెస్ లో చేరితే అందరి భవిష్యత్తు బాగుంటుంది ఆయన సన్నిహితులు చెప్పినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఘన విజయం సాధించాక తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని ఇటువంటి సమయంలోనే మంచి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందని పలువురు ఈటలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ సూచనలపై స్పందించిన ఈటల పార్టీ మారే ఆలోచన పెట్టుకోవద్దని అనుచరులకు సర్ధి చెప్పారని కొందరు చెబుతున్నారు.

గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో కూడా ఈటల తన అనుచరులతో చర్చించే నిర్ణయం తీసుకున్నారు. అలా బీజేపీలో చేరారు. ఇప్పుడు మరోసారి అనుచరులతో సమావేశం కావటంతో మళ్లీ ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. తమ నాయకుడికి బీజేపీలో తగిన ప్రాధాన్యత లభించటంలేదని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పార్టీ మారమని సూచిస్తున్నారట.

Komatireddy Venkat Reddy : డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చలు

ఈటల గనుక పార్టీ మారితే ప్రస్తుతం బీజేపీలో అసంతృప్తిగా ఉన్న మరింతమంది నేతలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి,బొడిగే శోభ కాంగ్రెస్ లో చేరే అవకాశముందనే చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ నుంచి ఈటల బయటకొచ్చిన సమయంలో తెలంగాణలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఏ హుజూరాబాద్ నియోజక వర్గం ఎమ్మెల్యేగా రాజీనామా చేశారో అదే సీటుపై బీజేపీ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.

కాగా.. బీజేపీలో పలువురు అసంతృప్త నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈటల రాజేందర్ తో పాటు.. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జిట్టా బాలకృష్ణ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సహా పలువురు సీనియర్లు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. మరి వీరి మౌనం వెనుక ఎటువంటి కారణముందో.. ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఎన్నికలు దగ్గపడితే మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.