NTR : కొత్త యాప్.. ‘థ్రెడ్స్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్..

మన తెలుగు నెటిజన్లు కూడా థ్రెడ్స్ యాప్ ను తెగ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోల్లో మొదటగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని అభిమానులని ఖుషి చేశారు.

NTR : కొత్త యాప్.. ‘థ్రెడ్స్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్..

Jr NTR entry in Threads app fans downloading app and following ntr

NTR Threads : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ (Twitter) కు పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్‌ (Threads App) అందుబాటులోకి తీసుకువచ్చారు. థ్రెడ్స్ యాప్ ప్లే‌స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు. గంటగంటకు థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్స్ పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో కూడా థ్రెడ్ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్ కలగలిసి ఉండటంతో ఇది త్వరలోనే పాపులర్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

మన తెలుగు నెటిజన్లు కూడా థ్రెడ్స్ యాప్ ను తెగ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోల్లో మొదటగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని అభిమానులని ఖుషి చేశారు. ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ లో జాయిన్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారు.

Manchu Lakshmi : నేను హాలీవుడ్ యాక్టర్‌ని.. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరు.. హాలీవుడ్‌లో ఉంటే స్టార్ అయ్యేదాన్ని..

ఎన్టీఆర్ థ్రెడ్స్ లో జాయిన్ అయిన కొన్ని నిమిషాలకే వేలల్లో ఫాలోవర్స్ వచ్చారు. మన టాలీవుడ్ సెలబ్రిటీలు థ్రెడ్స్ లోకి ఇంకెవరు వస్తారో చూడాలి మరి. మిగిలిన హీరోల అభిమానులు కూడా థ్రెడ్స్ యాప్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

ఎన్టీఆర్ ని థ్రెడ్స్ యాప్ లో ఇక్కడ ఫాలో అవ్వొచ్చు..  https://www.threads.net/@jrntr