KTR: ప్రభుత్వ బడిలో వసతులలేమిపై తన కొడుకు హిమాన్షు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందన

అమ్మాయిల వాష్ రూమ్స్ ఉన్న చోట పందులు ఉండటం చూశానని హిమాన్షు ఇటీవల అన్నారు.

KTR: ప్రభుత్వ బడిలో వసతులలేమిపై తన కొడుకు హిమాన్షు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందన

KTR

KTR – Telangana: ప్రభుత్వ బడిలో వసతులలేమిపై తన కొడుకు హిమాన్షు రావు (Himanshu Rao) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. హిమాన్షు చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలా మంది మీమ్స్ (memes) సృష్టిస్తున్నారు.

జులై 12న హైదరాబాద్ (Hyderabad) శివారులోని గౌలిదొడ్డి, కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను రూ.కోటి నిధులతో అన్ని వసతులతో నిర్మించి ప్రారంభించిన హిమాన్షు రావు అక్కడే తన జన్మదిన వేడుకలు జరుపుకుని, ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దాదాపు ఏడాది నుంచి ఆ బడి దుస్థితి ఎలా ఉందన్న విషయాన్ని దగ్గరి నుంచి పరిశీలించానని చెప్పారు. ఆ స్కూల్ పరిస్థితి చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని తెలిపారు. అమ్మాయిల వాష్ రూమ్స్ ఉన్న చోట పందులు ఉండటం చూశానని అన్నారు. బాలికల బాధ అర్థం అయ్యిందని తెలిపారు. ఆడపిల్లలకు సరైన బాత్రూమ్ లేదని, ఇటువంటి పరిస్థితులు తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు.

దీనిపై కేటీఆర్ ఇవాళ జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. తన కుమారుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బడిని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వమే బాగు చేస్తుందని చెప్పారు.

కాగా, తమ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవగాహనా రాహిత్యంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు విద్యుత్తు, విత్తనాలు అందని దుస్థితి ఉండేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మారిపోయిందని చెప్పారు.

మూడు ఎకరాలున్న రైతులకు మూడు గంటల విద్యుత్‌ సరిపోతుందని రేవంత్ అన్నారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అదే అని నిరూపించడం లేదా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అంత అవినీతి ఎలా జరిగిందో ఆయనే చెప్పాలని అన్నారు.

Vishnu Vardhan Reddy : ఏపీలో జనసేన-బీజేపీ ప్రభుత్వం రాబోతోంది, ఇక జగన్‌పై సమరమే- బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు