Fish Rain : శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం.. రోడ్లపై చేపలు చూసి ఎగబడిన జనం

మీరు ఎప్పుడైనా చేపల వర్షం చూసారా? తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం పడింది. ఇక ఆశ్చర్యపోయిన జనం చేపలు ఏరుకునేందుకు క్యూ కట్టారు.

Fish Rain : శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం.. రోడ్లపై చేపలు చూసి ఎగబడిన జనం

Srikakulam district

Fish Rain – Srikakulam District : దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. అయితే ఇక్కడ చేపల వర్షం పడింది. రోడ్లపై చేపలు పడటం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

Food For Fish : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు.. పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్న రైతులు

ఏపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో చేపల వర్షం కురిసింది. రోడ్డుపై భారీగా చేపలు పడటంతో స్ధానికులు ఆశ్చర్యపోయారు. వాటిని ఏరుకునేందుకు  పరుగులు తీసారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మునుపెన్నడు లేని విధంగా భారీగా చేపల వాన పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు చేపల కోసం తరలి వచ్చారు.

Arthritis Problems : ఆర్ధరైటిస్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో చేపలు చేర్చుకోండి!

వర్షాకాలంలో పలు చోట్ల చేపల వర్షం కురవడం సహజమే. మెరుపులు, పెను గాలుల సమయంలో సముద్రంలో ఉండే చేపలు, కప్పల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాల్లోకి చేరతాయి. అవి ఇలా వర్షంలో భూమిని చేరతాయని కనుగొన్నారు. మునుపెన్నడూ కురవని ప్రాంతాల్లో సైతం చేపల వర్షం పడుతుండటంతో జనం ఆశ్చర్యానికి లోనవుతున్నారు.