Solar Roof Cycling Track : హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి సోలార్ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

32వేల స్ట్రీట్ లైట్స్ కు పవర్ సప్లయ్ చేస్తుందన్నారు. ఆరేళ్లలో సోలార్ పవర్ ద్వారా ట్రాక్ నిర్మాణ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందన్నారు. Solar Roof Cycling Track

Solar Roof Cycling Track : హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి సోలార్ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Solar Roof Cycling Track

KTR – Solar Roof Cycling Track : హైదరాబాద్ లోని నార్సింగి దగ్గర సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రాక్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఉంది. నార్సింగి నుంచి పోలీసు అకాడమీ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు సైకిల్ ట్రాక్ ఉంది. మొత్తం 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ తో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్. సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మునిసిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మారుతున్న జీవన విధానం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ లాంటి శారీరక శ్రమ చేయాలన్నారు. మన దగ్గర డబ్బులు వచ్చే కొద్దీ సైకిల్, తర్వాత బైక్, తర్వాత కారు.. ఇలా కొంటూ పోవడం అలవాటైందన్నారు. హైదరాబాద్ లో సైక్లిస్టు లను చూస్తే సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ మొత్తం గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read..Electric Car : బాబోయ్.. ఎలక్ట్రిక్ కారులో మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది.. అసలేం జరిగింది?

నార్సింగి సైకిల్ ట్రాక్ దేశంలోనే మొదటి సోలార్ రూఫ్ ట్రాక్ అని తెలిపారు. సైక్లింగ్ కాపిటల్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. 32వేల స్ట్రీట్ లైట్స్ కు పవర్ సప్లయ్ చేస్తుందన్నారు. ఆరేళ్లలో సోలార్ పవర్ ద్వారా ట్రాక్ నిర్మాణ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందన్నారు. 16వేల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసామని కేటీఆర్ వెల్లడించారు.