Supriya Slams Himanta: ‘కుమార్తెను గాజా పంపిస్తున్న శరద్ పవార్’ వ్యాఖ్యపై సీఎం హిమంత బిశ్వాది కూడా ఒకటే డీఎన్ఏ అంటూ సుప్రియా ఘాటు రిప్లై

హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్‌ఏ ఉంది. ఆయన కాంగ్రెస్‌కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు

Supriya Slams Himanta: ‘కుమార్తెను గాజా పంపిస్తున్న శరద్ పవార్’ వ్యాఖ్యపై సీఎం హిమంత బిశ్వాది కూడా ఒకటే డీఎన్ఏ అంటూ సుప్రియా ఘాటు రిప్లై

Supriya Slams Himanta: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ప్రకటనతో రాజకీయ రగడ మొదలైంది. పవార్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. హమాస్‌తో పోరాడేందుకు శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను గాజాకు పంపిస్తారని అన్నారు. ఈ ప్రకటనపై సుప్రియా సూలే ఘాటుగా స్పందించారు. శర్మది, తనది ఒకటే డీఎన్ఏనని అంటూనే మహిళల పట్ల బీజేపీ తీరు అన్యాయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిమంత ప్రకటనపై సుప్రియా మాట్లాడుతూ ‘‘హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్‌ఏ ఉంది. ఆయన కాంగ్రెస్‌కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు. కానీ నేను హిమంత బిస్వా శర్మ నుంచి ఇలాంటివి ఊహించలేదు. స్త్రీల పట్ల ఆయన ఆలోచన ఎలా మారిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయనపై బీజేపీ ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ ఏమి చెప్పారో బీజేపీ ఐటీ సెల్ ముందుగా అర్థం చేసుకోవాలి. వారు ఆయన (శరద్ పవార్) పూర్తి ప్రకటనను వినాలి’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: 6000 ఫేక్ ఇన్‭పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసులు, రూ.57000 కోట్ల జీఎస్టీ ఎగవేత, 500 మంది అరెస్ట్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ.. పాలస్తీనా భూమిని ఇజ్రాయెల్ ఆక్రమించిందని అన్నారు. ఇల్లు, స్థలం, భూమి అన్నీ పాలస్తీనాకు చెందినవేనని, అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దానిని తన ఆధీనంలోకి తీసుకుందని అన్నారు. ఇక ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ మద్దతు ఇవ్వడంపై శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ అసలు సమస్యను విస్మరిస్తున్నారని ఆయన అన్నారు.

శరద్ పవార్ వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. వీరిలో పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను ప్రశ్నించగా.. ‘‘హమాస్‌తో పోరాడేందుకు శరద్ పవార్ తన కూతురు సుప్రియాను గాజాకు పంపుతారని భావిస్తున్నాను’’ అని అన్నారు. అస్సాం సీఎం ప్రకటనపై ఎన్సీపీ ఘాటుగా స్పందించింది. హిమంత బిస్వా శర్మ లాంటి వారిని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదని ఎన్సీపీ నేత జితేంద్ర అవాన్ అన్నారు.

ఇది కూడా చదవండి: స్వ‌లింగ సంప‌ర్కుల‌ వివాహాల‌ చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌కు సుప్రీం నో.. గుండె ప‌గిలింద‌న్న మంచు లక్ష్మి