Hardik Pandya : ఇంగ్లాండ్ తో మ్యాచ్ కూ హార్దిక్ పాండ్యా దూరం..! రీఎంట్రీ ఎప్పుడంటే?

చీలమండ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఉన్న హార్ధిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడు. పాండ్యా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.

Hardik Pandya : ఇంగ్లాండ్ తో మ్యాచ్ కూ హార్దిక్ పాండ్యా దూరం..! రీఎంట్రీ ఎప్పుడంటే?

Hardik Pandya

ODI World Cup 2023 Hardik Pandya: భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కివీస్ మ్యాచ్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం కావడంతో మధ్యలోనే వైదొలిగిన పాండ్యా.. కివీస్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే, వచ్చే ఆదివారం (అక్టోబర్ 29)న జరిగే మ్యాచ్ లోనూ హార్ధిక్ పాండ్యా ఆడటం కష్టమేనని తెలుస్తోంది.

Also Read : ODI World Cup 2023 : పాకిస్థాన్ ను చిత్తుచేసిన అఫ్గానిస్థాన్.. పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయా? ఎలా అంటే

కివీస్ తో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. హార్డిక్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో హార్డిక్ జట్టుకు ఎంతో బలమైన ప్లేయర్. అయితే, బీసీసీఐ వర్గాలు ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ సమయానికి తుదిజట్టులో హార్ధిక పాండ్యా చేరుతాడని చెబుతున్నాయి.. తాజాగా అతని రీఎంట్రీపై కీలక అప్ డేట్ వచ్చింది. అతనికి ఇంకొన్ని మ్యాచ్ లకు విశ్రాంతి అవసరమని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇప్పట్లో హార్దిక్ పాండ్యా తుదిజట్టులోకి వచ్చే అవకాశం లేదు.

Also Read : ODI World Cup 2023: పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత బస్సులో డ్యాన్స్ వేసిన అఫ్గాన్ ప్లేయర్స్.. ఏ పాటకో తెలుసా? వీడియో వైరల్

చీలమండ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఉన్న హార్ధిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడు. పాండ్యా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతను పూర్తిస్థాయిలో కోలుకునేవరకు తుది జట్టులోకి తీసుకోవద్దని మేనేజ్ మెంట్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 29న ఇంగ్లాండ్, నవంబర్ 2న శ్రీలంకతో మ్యాచ్ లకు హార్దిక్ తుదిజట్టులో చేరే అవకాశాలు లేవని తెలుస్తోంది. అప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోకుంటే నేరుగా సెమీ ఫైనల్ మ్యాచ్ ల సమయంలో జట్టులోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇస్తాడని సమాచారం. ఇదిలాఉంటే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో హార్ధిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే వరకు సూర్యకుమార్ ను తుదిజట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.