Olympics : భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు…ఏ సంవత్సరంలో అంటే…?

భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....

Olympics : భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు…ఏ సంవత్సరంలో అంటే…?

Olympics

Olympics : భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. గోవాలో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో 9 ఏళ్ల క్రితం కేటాయించిన బడ్జెట్ కంటే మూడురెట్లు అధికమని ప్రధాని చెప్పారు.

Also Read : Muralidhar Goud : రిటైర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను అంటూ ఏడ్చేసిన నటుడు..

చైనాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించిన వారం రోజుల తర్వాత క్రీడా ప్రపంచంలో భారత్ సాధించిన విజయాలు ప్రతి యువ క్రీడాకారుడికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని మోదీ అన్నారు. మార్గోవోలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు. భారత క్రీడలు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో గోవాలో ఈ క్రీడలు జరుగుతున్నాయన్నారు.

Also Read :  Election Commission of India: ఎన్నికల్లో జప్తు చేసే కోట్ల రూపాయలను ఏం చేస్తారు?

క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు పథకాల్లో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. భారత్‌లో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, ఎంతో మంది క్రీడా ఛాంపియన్‌లను దేశం తయారు చేసిందని మోదీ అన్నారు. 2014వ సంవత్సరం తర్వాత దేశంలో క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రధాని చెప్పారు. క్రీడల పురోగతిలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని మోదీ అన్నారు.

Also Read : Ground Water : భారతదేశంలో భూగర్భజలాల క్షీణతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులను గుర్తించి వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నామని, వారి ఆహారం, శిక్షణకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఆసియా పారా గేమ్స్‌లో కూడా భారత క్రీడాకారులు 70కి పైగా పతకాలు సాధించి, మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. అంతకు ముందు వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో భారతదేశం చరిత్ర సృష్టించింది. 2036లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ పునరుద్ఘాటించారు.

Also Read :  Muralidhar Goud : రిటైర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను అంటూ ఏడ్చేసిన నటుడు..

అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణను అందించేందుకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ చొరవను రూపొందించామని ప్రధాని చెప్పారు. ‘‘2030లో యూత్‌ ఒలింపిక్స్‌, 2036లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. ఒలింపిక్స్‌ నిర్వహించాలన్న మా ఆకాంక్ష కేవలం భావోద్వేగాలకే పరిమితం కాదు.. దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి’’ అని మోదీ వివరించారు.