Vishnu Vardhan Reddy : ఫలించిన మంత్రి హరీశ్ రావు భేటీ .. బీఆర్ఎస్‌లోకి విష్ణువర్థన్ రెడ్డి

తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని తెలిపారు మంత్రి. ఆయనకు పార్టీలు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

Vishnu Vardhan Reddy : ఫలించిన మంత్రి హరీశ్ రావు భేటీ .. బీఆర్ఎస్‌లోకి విష్ణువర్థన్ రెడ్డి

Miniset Harish Rao..Vishnu Vardhan

Miniset Harish Rao..Vishnu Vardhan : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రంజుగా మారుతోంది. టికెట్లు దక్కని ఆశావహులు పార్టీల నుంచి జంప్ అవుతున్నారు. ఏ పార్టీ నుంచి ఏ నేత బయటకు వస్తాడో అనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారుతున్న తరుణంలో ఆయా పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఆ విషయం తెలిసిన వెంటనే భంగపడిన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. వెంటనే అసంతృప్తి నేతల ఇంటికి చేరుకుని తమ పార్టీలో చేరాలని కోరుతున్నారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఓ పక్క పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటం..తాము ఆశించిన పార్టీనుంచి టికెట్ దక్కకపోవటంతో ఆయా పార్టీల నుంచి వచ్చిన అవకాశాలన్ని వదులుకోకూడదనే ఆలోచనతో కోరి వచ్చిన పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీనుంచి టికెట్ దక్కకపోవటంతో విష్ణువర్దన్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ దక్కలేదని..అసంతృప్తిగా ఉన్నారనే సమాచారంతో మంత్రి హరీశ్ రావు విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన్ని తమ పార్టీలో చేరాలని కోరారు. దీనికి విష్ణు కూడా అంగీకరించారు. దీంతో మంత్రి హరీశ్ రావు భేటీ ఫలించినట్టైంది.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు…తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి అని..ఆయన్ని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని తెలిపారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కి తెలంగాణ ఉద్యమంతో విష్ణుకు అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టికెట్లు అమ్ముకునే కాంగ్రెస్ లో విష్ణులాంటి నేతలకు న్యాయం జరగదన్నారు. కానీ బీఆర్ఎస్ లో విష్ణుకు గౌరవమైన స్థానాన్ని కల్పిస్తామన్నారు.

కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకే గజ్వేల్‌లో పోటీ : ఈటల రాజేందర్

బీఆర్ఎస్ లో చేరికపై విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు..కాంగ్రస్ లో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఏనాడు ఊహించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ లో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకోవటమే కాదు గాంధీ భవన్ ని కూడా అమ్మే పరిస్థితి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ రావు తనను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారని త్వరలోనే పార్టీలో చేరతాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

కాగా.. విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి దివంగత నేత పీజేఆర్ అంటే తెలియనివారు ఉండరు. ‌పీజేఆర్ మరణం తరువాత ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తండ్రి కొనసాగిన పార్టీలోనే ఆయన కూడా చేరారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవటంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకోవాలని భావించింది. దీంట్లో భాగంగా మంత్రి హరీశ్ రావు విష్ణుతో భేటీ కావటం,బీఆర్ఎస్ లో చేరాలని ఆఫర్ ఇవ్వటంతో విష్ణు అంగీకరించారు. గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం ముహూర్తం చూసుకుని గులాబీ తీర్థం పుచ్చుకోవటానికి విష్ణు రెడి అయ్యారు. బీఆర్ఎస్ లో త్వరలో చేరతానని విష్ణు చెప్పటంతో ఇక ఆయన చేరిక ఖాయమైంది. సీఎం కేసీఆర్ ను విష్ణు కలిసినట్లుగా సమాచారం. ఇక విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో ఈ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలినట్లే..