YV Subbareddy : ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీదే గెలుపు : వైవీ సుబ్బారెడ్డి

రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

YV Subbareddy : ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీదే గెలుపు : వైవీ సుబ్బారెడ్డి

YCP Leader  YV Subbareddy

YCP Leader  YV Subbareddy : ఎన్ని పార్టీలు కలిసొచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీదే గెలుపని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంపై జనసేన బురద జల్లే పనిలో నిమగ్నమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు.

వైసీపీ సాధికారిక బస్సు యాత్ర తొలి విడత విజయవంతం అయిందన్నారు. తొలి దశలో పెద్ద ఎత్తున ప్రజలు బస్సు యాత్రకు నీరాజనం పలికారని తెలిపారు. బుధవార నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుందని వెల్లడించారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.

BTech Ravi : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలకు వైపీపీ ప్రభుత్వం 70 శాతం సంక్షేమ పథకాలు అందించిందని తెలిపారు.

సామాజిక సాధికారిక యాత్రలో ‘నాడు- నేడు’ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 23వ తేదీన సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించనున్నారని తెలిపారు.