Amit Shah : బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం : అమిత్ షా

తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు.  బీజేపీ ప్రభుత్వం ఓబీసీ సహా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిందన్నారు.

Amit Shah : బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం : అమిత్ షా

Amit Shah (1)

Amit Shah Public Meeting : బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మోడీ గ్యారేజిలో వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విలువైన ఓటుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రెండుసార్లు ప్రజలను మోసం చేశాడని, మూడోసారి మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడని పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లాలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

కేసీఆర్ ప్రభుత్వం.. శివన్న గూడెం, బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. నల్లగొండ స్మార్ట్ సిటి కోసం కేంద్రం రూ.400 కోట్లు ఇస్తే.. పూర్తిగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని ఆరోపించారు. “దళిత బంధు” పేరుతో ఎమ్మెల్యేలు కమీషన్ల పేరుతో దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు.  బీజేపీ ప్రభుత్వం ఓబీసీ సహా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిందన్నారు.

CM KCR : తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ : సీఎం కేసీఆర్

జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. బీసీ పిల్లలకు 25% ఎంబీసీ రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. మజ్లిస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ విరుద్ధమైన, మతపరమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతామని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని అన్నారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని.. సోనియాగాంధీ తన కొడుకు రాహుల్ ని ప్రధాని కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. బీజీపీ అధికారంలోకి వస్తే కుటుంబ, వారసత్వ రాజకీయాలు ఉండబోవన్నారు. ప్రధాని మోదీ సుపరిపాలనకు, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు.

CM KCR : తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ : సీఎం కేసీఆర్

మిషన్ భగీరథ పేరుతో కమీషన్లు తీసుకున్నారుని విమర్శించారు. మిషన్ కాకతీయలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మియాపూర్ భూముల స్కాం, కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్యం కుంభకోణంలో భాగమైందని ఆరోపించారు. మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకుందని తెలిపారు. అయోధ్య రామ మందిరం పూర్తి చేసిన ఘనత మోదీకే దక్కిందని పేర్కొన్నారు. జనవరి 22న రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం పున:ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.