Mahbubnagar Politics : మహబూబ్‌నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?

Mahabubnagar Politics : మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు వంటి వారు పోటీలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో..? నేతల జాతకాలు ఏంటో ఈ రోజు బ్యాటిల్‌ఫీల్డ్‌లో తెలుసుకుందాం.

Mahbubnagar Politics : మహబూబ్‌నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?

Mahbubnagar Political Scenario Battlefield

ఉమ్మడి పాలమూరు జిల్లా పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ కీలక నేత, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో గత ఎన్నికల్లో కారు పార్టీదే హవా. మొత్తం 14 నియోజకవర్గాల్లో కొల్లాపూర్ తప్ప మిగిలిన 13 చోట్ల విజయం సొంతం చేసుకుంది బీఆర్‌ఎస్. ఎన్నికల తర్వాత కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా కారెక్కేయడంతో కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేయే లేకుండా పోయారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో.

Also Read : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?

ఇక ఈ ఎన్నికల్లో కారు – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. కల్వకుర్తి, మక్తల్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో సమానంగా కమలదళం కూడా మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఐతే బీజేపీ చీల్చే ఓట్లే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల జాతకాలు మార్చే పరిస్థితి కనిపిస్తుండటంతో ఆ రెండు పార్టీల వారు.. కాషాయ దళం కదలికలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

Also Read : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?

మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు వంటి వారు పోటీలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో..? నేతల జాతకాలు ఏంటో ఈ రోజు బ్యాటిల్‌ఫీల్డ్‌లో తెలుసుకుందాం. ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాబలాలపై విశ్లేషణ..

Also Read : మహేశ్వరంలో ట్రయాంగిల్ ఫైట్.. సబిత ఓటమి ఖాయమంటున్న ప్రత్యర్థులు