Minister KTR : హైదరాబాద్ అభివృద్ధి రజినీకాంత్ కు అర్థమైంది కానీ, ఇక్కడున్న గజినీలకు అర్థం కావడం లేదు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

Minister KTR : హైదరాబాద్ అభివృద్ధి రజినీకాంత్ కు అర్థమైంది కానీ, ఇక్కడున్న గజినీలకు అర్థం కావడం లేదు : మంత్రి కేటీఆర్

Minister KTR (9)

Minister KTR Real Estate Summit : హైదరాబాద్ అభివృద్ధిలో వచ్చిన మార్పు రజినీకాంత్ కు అర్థమైంది కానీ, ఇక్కడున్న గజినీలకు అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనా, ఒక సంవత్సరం ఎన్నికలకు పోయిందన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

తెలంగాణలో 6.5 సంవత్సరాలు మాత్రమే తమ ప్రభుత్వానికి పనిచేసే అవకాశం వచిందన్నారు. కానీ, మనకు గుర్తుకువచ్చేది ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమేనని తెలిపారు. 1994-2004 చంద్రబాబు, 2004-2009 వైఎస్ రాజశేఖరరెడ్డి, 2014 నుంచి కేసీఆర్ మాత్రమే గుర్తుంటారని పేర్కొన్నారు. 1989 నుంచి 2014 వరకు 25 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2021 నుంచి 2022లో ఒక్క సంవత్సరమే 57 వేల ఐటీ ఎగుమతులు జరిగాయని పేర్కొన్నారు.

Revanth Reddy : తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. అమిత్ షా, కేసీఆర్ కామన్ ప్లాన్ అర్థం చేసుకోవాలని సూచన

3.5 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. 30 శాతం పంచాయతీ అవార్డ్స్ తెలంగాణకే వచ్చాయని తెలిపారు. ప్రతిపక్షాలకు తమను తిట్టడానికి ఏమి దొరకడం లేదని.. అందుకే తమకు అహంకారం ఉందని వ్యక్తిగతంగా మాటాడుతున్నారని పేర్కొన్నారు.

తమకు అహంకారం లేదని తెలంగాణపై చచ్చేంత మమకారం ఉందన్నారు. తెలంగాణలో వచ్చేది తామేనని ప్రతిపక్షాలు సహా అందరికి తెలుసన్నారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తమ లక్ష్యం అన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కోనుక్కోవడానికి ఒక కొత్త పథకం తీసుకురాబోతున్నామని తెలిపారు.

Gangula Kamalakar : ఆంధ్రోళ్లు మళ్లీ వస్తున్నారు.. షర్మిల, పవన్, పాల్‌పై గంగుల సంచలన వ్యాఖ్యలు

ధరిణిలో సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం

ధరిణిలో కొన్ని చిక్కులు, చికాకుకు ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. చిన్న సమస్య ఉందని ధరణిని రద్దు చేయమనడం ఎంతవరకు సమంజసమన్నారు. తమకు హాలిడే ఇవ్వకండి.. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటేసిందన్నారు. 2047 నాటికి ఏపీ, తెలంగాణ.. హిందూ, ముస్లిం లాంటి బేధాలు లేకుండా సమగ్ర వృద్ధి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వెహికల్ షటల్ సర్వీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించవచ్చన్నారు. గ్రీన్ బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 977 అర్బన్ పార్క్ లు ఏర్పాటు చేశామని.. వాటిని ఇంకా పెంచుతామని తెలిపారు. వేస్ట్ వాటర్ పాలసీ తెచ్చి కాలుష్యం నియంత్రణకు కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ను మరింత సేఫ్ సిటీగా మారుస్తామని తెలపారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకొస్తామన్నారు.

Barrelakka: బర్రెలక్కకే మా మద్దతు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా కేవలం ఒక గంటలో హైదరాబాద్ చేరుకునేలా ఒక ట్రాన్స్ పోర్టు ప్లాన్ సిద్ధం చేస్తున్నామని, వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లో వరదల నియంత్రణ, డ్రైనేజీ నిర్వహణ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ని ఒలింపిక్స్ కోసం సిద్ధం చేయాలనేది తమ కల అని పేర్కొన్నారు. 2047కి హైదరాబాద్ ని వరల్డ్ క్లాస్ నగరంగా చూడాలని అనుకుంటున్నామని తెలిపారు.