Jobs Guaranteed : జాబ్ గ్యారంటీపై నిరుద్యోగులకు అన్ని పార్టీల హామీలు…ఖాళీల భర్తీ అంత సులభం కాదంటున్న నిపుణులు

తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది ఓటర్లు యువత ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్ల కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు వారి వారి మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగభృతి ఇస్తామంటూ హామీల వర్షం కురిపించారు...

Jobs Guaranteed : జాబ్ గ్యారంటీపై నిరుద్యోగులకు అన్ని పార్టీల హామీలు…ఖాళీల భర్తీ అంత సులభం కాదంటున్న నిపుణులు

Jobs guaranteed

Jobs Guaranteed : తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది ఓటర్లు యువత ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్ల కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు వారి వారి మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగభృతి ఇస్తామంటూ హామీల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాబ్ క్యాలెండరును ప్రకటిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇస్తామని అన్ని రాజకీయ పక్షాలు యువతకు హామీలు ఇచ్చారు.

ALSO READ : Mohammed Shami : కారు ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ

ఎన్నికల్లో కీలకమైన యువత ఓట్ల కోసం అన్ని పార్టీల నేతలు ఉద్యోగాలిస్తామని హామీలు ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం సవాలుతో కూడుకున్నదని, దీంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి లబ్దిదారులను గుర్తించడం చాలా కష్టమైన పని అని విద్యావేత్తలు చెబుతున్నారు. ‘‘కొన్ని దశాబ్దాల క్రితం వరకు యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత వారి పేర్లను తొలగించారు.

ALSO READ : Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ…సోషల్ మీడియాలో పోస్ట్

ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగులను గుర్తించడం కష్టం. నిరుద్యోగ భృతి మంజూరుకు సంబంధించి అర్హత అనేది ప్రధాన సమస్య. నిరుద్యోగ భృతి ఇవ్వడం కోసం ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలి? పదోతరగతి పూర్తి చేసిన యువకుడు, గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిగ్రీ హోల్డర్ అనేది ప్రశ్నార్థకంగా మారింది’’ అని టీఎస్ పీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రశ్నించారు. ‘‘25 నుంచి 30 లక్షల మంది ఉద్యోగాలు ఆశించేవారు టీఎస్ పీఎస్సీలో పేర్లను నమోదు చేసుకున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఆస్తులు, కేసుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అధికం…ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడి

కానీ వారిలో చాలా మందికి ప్రభుత్వంలో, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు లభించి ఉండవచ్చు లేదా విదేశాలల్లో వారు పని చేస్తూ ఉండవచ్చు. వారిని ట్రాక్ చేయడం కష్టం’’ అని ఓ మాజీ అధికారి వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ అంశంపై నిపుణులు మాట్లాడుతూ, న్యాయపరమైన అడ్డంకులు తెలంగాణలో సవాలుగా మారాయని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. అయితే ఉద్యోగార్థులు వివిధ సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ALSO READ : Hyderabad DRDO Recruitment 2023 : హైదరాబాద్‌ డీఆర్‌డీవో సెప్టమ్‌ లో ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ

ఉదాహరణకు నోటిఫికేషన్‌లోఎమ్మెస్సీ జువాలజీని విద్యార్హతగా నిర్ణయించారు. అయితే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులో జంతుశాస్త్రాన్ని అభ్యసించిన ఆశావహులు కూడా అర్హులని కోర్టుకు వెళ్లారు.గ్రూప్ I పేపర్ లీక్‌ ఉద్యోగాల భర్తీకి పెద్ద దెబ్బగా మారింది. టీఎస్‌పీఎస్‌సీలో లోపాలు ఉన్నందున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్సీని పునరుద్ధరిస్తామని చెబుతున్నారు.

ALSO READ : Rahul Gandhi : కేసీఆర్ ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారు : రాహుల్ గాంధీ

వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎలా ఇస్తారని కాంగ్రెస్ నేతల హామీలను ఉటంకిస్తూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల కోసం నిరుద్యోగులను మభ్య పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రతీ రాజకీయపార్టీ ఉద్యోగ ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని చెబుతున్నా ఆచరణలో ఇది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు.