Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు…డ్రోన్లతో నిఘా

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రభద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలతో క్విక్ రియాక్షన్ బృందాలను నియమించారు....

Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు…డ్రోన్లతో నిఘా

central forces

Telangana Assembly Election 2023 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రభద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలతో క్విక్ రియాక్షన్ బృందాలను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ జరిపారు. మావోయిస్టుల కోసం ఒక వైపు గాలిస్తూనే ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా

డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. నవంబర్ 30వతేదీన పోలింగ్ సందర్భంగా కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా పకడ్బందీ బందోబస్తు ప్లాన్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రామగుండం, మహబూబాబాద్, ఆదిలాబాద్, రామగుండం, నిర్మల్, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోని 614 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు

మావోయిస్టు ప్రాబల్యమున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. 23వేల అసోం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్, బీఎస్ఎఫ్ , సీఐఎస్ఎఫ్ బలగాలను తెలంగాణకు రప్పించారు. 12 వేల మంది కేంద్ర బలగాలను మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నియమించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో కేంద్ర బలగాలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం

ఈవీఎంలున్న స్ట్రాంగ్ రూంల వద్దకూడా కేంద్ర భద్రతా బలగాలను నియమించారు. భారీబందోబస్తుతో ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూస్తామని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రత్నాకర్ ఝా చెప్పారు. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో అభ్యర్థులకు భద్రత కల్పించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా వేసిన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ALSO READ : Rainfall Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…14 మంది మృతి,ఐఎండీ హెచ్చరికలు జారీ

ఈ సారి ప్రత్యేకంగా ఎన్నికల బందోబస్తులో పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేంద్రాల వద్ద సాయుధ పోలీసులను నియమించారు. ఒకవైపు ముమ్మర తనిఖీలు, మరో వైపు గాలింపు, భద్రత కల్పనతో మూడంచెల పోలీసు వ్యూహాలను రూపొందించారు.