KCR And Revanth Reddy : ఆలోచనల్లో అంతుచిక్కరు, ఆచరణలో వెనక్కితగ్గరు.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే

గాడ్ ఫాదర్స్ లేకపోయినా చాకచక్యంతో అవకాశాలను అందిపుచ్చుకుని తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఈ ఇద్దరు నేతలు.

KCR And Revanth Reddy : ఆలోచనల్లో అంతుచిక్కరు, ఆచరణలో వెనక్కితగ్గరు.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే

Common Points In KCR And Revanth Reddy

తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేర్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డివే. నాయకత్వ లక్షణాల్లో ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన వారు. గాడ్ ఫాదర్స్ లేకపోయినా చాకచక్యంతో అవకాశాలను అందిపుచ్చుకుని తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఈ ఇద్దరు నేతలు. వేర్వేరు పార్టీల నాయకులే అయినా ఈ ఇద్దరిలో కొన్ని సారూప్యతలు, నెగ్గుకు రావటానికి కావాల్సిన లక్షణాలు కనిపిస్తాయి.

Also Read : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

కేసీఆర్, రేవంత్ రెడ్డి.. ఇద్దరూ మాటల మాంత్రికులే. వీరిద్దరూ ఇతరులను ఆకట్టుకోవడంలో సిద్ధహస్తులు కూడా. ఇక.. మాయ, మర్మం, వ్యూహ-ప్రతి వ్యూహాలు తెలిసిన వాళ్లు. ఇద్దరు నేతలు పార్టీ అధినేతలుగా అజెండాను సెట్ చేస్తారు. ఎదుటి వారి ఎత్తులను నిర్వీర్యం చేయడంలో సిద్ధహస్తులు. కేసీఆర్, రేవంత్ రెడ్డి.. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలిసిన వారు. ఆలోచనలో అంతుచిక్కరు. ఇక, ఆచరణలో వెనక్కితగ్గరు. లౌకిక జ్ఞానం, లోకజ్ఞానం తెలిసిన ఇద్దరు.. సిద్దాంతాలు, రాద్దాంతాలకంటే పని జరగడమే ముఖ్యమని నమ్ముతారు. ఎవరినైనా ఇట్టే కలుపుకుని పోతారు. తేడా వస్తే అంతే దూరం పెడతారు.

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

ఇద్దరికీ జనం నాడి తెలుసు. కామన్ సెన్స్ ఇద్దరికీ కామన్ పాయింట్ అని చెప్పుకోవాలి. అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా లాజిక్ చెప్పగలరు. మ్యాజిక్ చేయగలరు. ఇద్దరూ కూడా ముందుచూపు, స్వయంకృషితో పైకి వచ్చినవారే. రిస్క్ చేస్తారు, తమ వారిని రెస్క్యూ కూడా చేస్తారు. అలాగే ప్రత్యర్థులపై దాడి చేస్తారు, డామినేట్ చేసేస్తారు. ఇద్దరు నేతలకూ డైరెక్షన్ కూడా తెలుసు.