BJP MP GVL : తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం ఖాయం : జీవీఎల్

తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.

BJP MP GVL : తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం ఖాయం : జీవీఎల్

BJP MP GVL

BJP MP GVL..Telangana assembly elections :  తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతు..తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.బీఆర్ఎస్ పై వ్యతిరేకత తో కాంగ్రేస్ గెలిచిందన్నారు. తెలంగాణలో మూడు నెలల్లో కాంగ్రెసు గ్రాఫ్ పడిపోబోతుంది అంటూ జోస్యం చెప్పారు.ఏపీలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కార్యచరణ ప్రారంభిస్తున్నామని..ఏపీలో అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ ఉంటుందని తెలిపారు.

తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకును ముందుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయని అన్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ ఎంత బలంగా ఉందో ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేశాయన్నారు.హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందని..మధ్యప్రదేశ్ లో ఘన విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు.జయహో బీజేపీ పేరుతో మూడు కేకులు కట్ చేసి ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నానని తెలిపారు.2024లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని..మూడో సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తంచేశారు.

కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..?విజయసాయి రెడ్డి

మరోమారు మోడీ సారు అనే వాయిస్ ప్రజల నుంచి వినిపించనుందన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ పేరుతో ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేసిందని..దేశంలో గ్యారెంటీ అంటేఅది మోదీ గ్యారెంటీ మాత్రమేనని అన్నారు. మోడీ ప్రభావం 2024లో 400 పైగా స్థానాల్లో గెలుస్తామనే ధీమా బీజేపీలో ఉందన్నారు.దక్షిణాది రాష్ట్రలపై ఫోకస్ చేయబోతున్నామని ..తెలంగాణలో బీజేపీ గతం కంటే బలపడిందని అది ఓటింగ్ శాతం పెరగటమే దీనికి నిదర్శనమన్నారు. బీజేపీని దక్షిణాదిలో బలపరచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడినా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించబోతుందన్నారు. ఇండియా కూటమిని ప్రజలు తిప్పికొట్టారని..ఇండియా కూటమి ఒక జోక్ అంటూ ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత ఇండియా కూటమికి బీటలువారాయన్నారు.కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తం అంటూ విమర్శించారు. 6తేదీ ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ ఎదురుదెబ్బ ఎదుర్కోనుందని..రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపించుకోవటానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని..మరో రెండు నెలల్లో కార్యాచరణ తీవ్రతరం చేయబోతున్నామన్నారు.లోక్ సభ ఎన్నికల్లో 400 స్థానాలు గెలిచేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఉంటాయని తెలిపారు.