KS Bharat : శ్రీరాముడికి సెంచ‌రీని అంకితం ఇచ్చిన భ‌ర‌త్‌.. సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, తెలుగు కుర్రాడు కేఎస్ భ‌ర‌త్ త‌న సెంచ‌రీని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.

KS Bharat : శ్రీరాముడికి సెంచ‌రీని అంకితం ఇచ్చిన భ‌ర‌త్‌.. సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌

KS Bharat dedicates century to Lord Ram

KS Bharat dedicates century to Lord Ram : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, తెలుగు కుర్రాడు కేఎస్ భ‌ర‌త్ ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న అన‌ధికార టెస్టు సిరీస్‌లో 490 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో భ‌ర‌త్ అజేయ సెంచ‌రీతో రాణించాడు. కాగా.. ఈ సెంచ‌రీని భ‌ర‌త్ శ్రీరాముడికి అంకితం చేయ‌డం విశేషం. భ‌ర‌త్ సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ భార‌త్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌లేదు. అయితే.. మ్యాచ్‌ డ్రా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో సెంచరి పూర్తి కాగానే భ‌ర‌త్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న తీరు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భర‌త్‌ విల్లును ఎక్కుపెడుతూ.. సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. అయోధ్యలో రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ఠ నేప‌థ్యంలో రాముడి ప‌ట్ల భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ ఆ భ‌గ‌వంతుడికి త‌న శ‌త‌కాన్ని అంకితం ఇస్తూ భ‌ర‌త్ ఇలా చేశాడు.

Virat Kohli : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. నిరాశ‌లో తెలుగు రాష్ట్రాల‌ క్రికెట్ అభిమానులు

ఇదిలా ఉంటే.. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ల‌య‌న్స్ ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయి 553 ప‌రుగులు చేసింది. జెన్నింగ్స్ (154; 188 బంతుల్లో 20 ఫోర్లు, 2సిక్స‌ర్లు), జోష్ బోహన్నన్ (125; 182 బంతుల్లో 14 ఫోర్లు, 1సిక్స్‌) శ‌త‌కాల‌తో క‌దం తొక్క‌గా అలెక్స్ (73), మౌస్లీ (68), జాక్ కార్‌స‌న్ (53 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో ఇంగ్లాండ్ ల‌య‌న్స్ భారీ స్కోరు చేసింది. అనంత‌రం ర‌జ‌త్ ప‌టీదార్ (151; 158 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) భారీ శ‌త‌కం సాధించిన‌ప్ప‌టికీ మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 227 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 326 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

ఆత‌రువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ల‌య‌న్స్ జెన్నింగ్స్ (64), జేమ్స్ (56) అర్ధ‌శ‌త‌కాలు బాద‌డంతో 163/6 స్కోరు వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భార‌త్ ముందు 490 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యం నిలిచింది. కేఎస్ భ‌ర‌త్ అజేయ శ‌త‌కం చేయ‌డం.. సాయి సుద‌ర్శ‌న్ (97), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (55) హాఫ్ సెంచ‌రీలు సాధించ‌డంతో భార‌త్-ఏ ఐదు వికెట్లు కోల్పోయి 426 ప‌రుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

కాగా.. ఇంగ్లాండ్‌తో జ‌రిగిన జనవరి 25 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌కు భ‌ర‌త్ వికెట్ కీప‌ర్‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ కీల‌కమైన టెస్టు సిరీస్‌కు ముందు భ‌రత్ ఫామ్ అందుకోవ‌డం శుభ ప‌రిణామం

Rohit Sharma : ధోనిదా, సెహ్వాగ్‌దా?.. ఈ ఇద్ద‌రిలో రోహిత్ శ‌ర్మ‌ ఎవ‌రి రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తాడో..!