Mandapeta: మండపేట ఎమ్మెల్యే సీటుకు మంట.. ఏం జరుగుతుందో తెలుసా?

టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.

Mandapeta: మండపేట ఎమ్మెల్యే సీటుకు మంట.. ఏం జరుగుతుందో తెలుసా?

Mandapeta

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత వేగుళ్ల జోగేశ్వరరావుపై టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మండపేట టీడీపీ ఎమ్మెల్యే సీటు మార్చాలని ఆ పార్టీ సీనియర్ నేత నెక్కంటి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గంలో వేగుళ్లకు ఉన్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చేందుకు తాను పోటీకి సిద్ధమని నెక్కంటి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.

ఇటీవల మండపేటలో ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మూడోసారి గెలిపించాలంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన కూడా అభ్యంతరాలు తెలిపింది. తమతో చర్చించకుండానే టీడీపీ అభ్యర్థులను ప్రకటించడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తప్పుపట్టారు.

Jayadev Galla : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి