Chiranjeevi : చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా.. క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో..
చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ, తనను క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో పోస్ట్ చేశారు.
![Chiranjeevi : చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా.. క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో.. Chiranjeevi : చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా.. క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో..](https://10tv.in/wp-content/uploads/2024/02/Chinni-Krishna-said-sorry-to-Chiranjeevi-for-his-previous-comments.jpg)
Chinni Krishna said sorry to Chiranjeevi for his previous comments
Chiranjeevi : చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’కి కథని అందించిన రైటర్ చిన్నికృష్ణ.. చిరుకి క్షమాపణ చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. పద్మవిభూషణ్ కి ఎంపికైన చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన చిన్నికృష్ణ.. అనంతరం ఓ వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ వీడియోలో గతంలో తాను చేసిన ఓ తప్పుకి ఇప్పుడు సిగ్గుపడుతున్నట్లు, పశ్చాతాపం పడుతున్నట్లు పేర్కొన్నారు.
అసలు ఏమైందంటే.. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ చిన్నికృష్ణ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. దానిలో ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవికి ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ కథని ఇస్తే. కనీసం నాకు ఆకు వేసి అన్నం కూడా పెట్టలేదు. అంతేకాకుండా ఆ సినిమా క్రెడిట్ అంతా వాళ్లే తీసుకున్నారు” అంటూ వైరల్ కామెంట్స్ చేశారు. అప్పటిలో ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే చిరంజీవిని అలా తిట్టినందుకు చిన్నికృష్ణ సతీమణితో పాటు ఇంటిలోని ప్రతి ఒక్కరు, బంధువులు అందరూ.. చిన్నికృష్ణ చేసిన తప్పుని వేలు ఎత్తి చూపిస్తూ తిట్టారంట. ఇంద్ర సమయంలో తనని పిలిచి మరి అవకాశం ఇచ్చిన చిరంజీవి పై చేసిన విమర్శలు.. పలువురు ప్రభావితం వలన వచ్చిన వ్యాఖ్యలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. అలా మాట్లాడి, తప్పు తెలుసుకున్న తరువాత చిరంజీవిని మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
Also read : Oy Re Release : రీ రిలీజ్‌కి సిద్దమైన ‘ఓయ్’.. డైరెక్టర్ని తిట్టేసిన నెటిజెన్.. దర్శకుడు రిప్లై..
పద్మవిభూషణ్ అందుకున్న ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంటికి వెళ్తే.. ఆప్యాయంగా ఆహ్వానించి, తనని ప్రేమతో పలకరించి, తన పిల్లలు మరియు కుటుంబం బాగోగులను చిరంజీవి అడిగి తెలుసుకున్నారని చిన్నికృష్ణ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కథలు ఏమైనా రాస్తున్నావా అని తన కెరీర్ గురించి కూడా అడిగి తెలుసుకున్నట్లు చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు.
ఇలాంటి గొప్ప వ్యక్తి గురించా తాను తప్పుగా మాట్లాడింది అంటూ బాధ పడ్డారు. మరోసారి తన నోటి నుంచి చిరంజీవిని తిడుతూ మాటలు రావని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Writer chinni Krishna apologies to @KChiruTweets garu ❤️
BOSS mimmalni enni matalu anna mee kshaminche gunam ki 🙏🧎🏻#PadmaVibhushanChiranjeevi pic.twitter.com/XkqZCV7olR
— RRReddy (@RamRohitReddy) February 1, 2024