IND vs AUS: ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చేసింది.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్లు ఫైనల్స్‌లో ఎన్నిసార్లు తలపడ్డాయి? పూర్తి వివరాలు ఇలా ..

అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కంగారూ జట్టును ఓడించడం ద్వారా 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యువ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.

IND vs AUS: ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చేసింది.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్లు ఫైనల్స్‌లో ఎన్నిసార్లు తలపడ్డాయి? పూర్తి వివరాలు ఇలా ..

ICC Under 19 World Cup 2024

U19 World Cup 2024 Final : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ కు చేరింది. ఇప్పటికే భారత్ జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 11 (ఆదివారం) ఫైనల్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు బెనోనిలోని విల్లోమూర్ పార్క్ మైదానంలో తలపడనున్నాయి. ఐసీసీ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ లో తలపడటం ఆర్నెళ్లలో ఇది రెండోసారి. పురుషుల ప్రపంచ కప్ 2023లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది.

Also Read : U19 World Cup 2024 : అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్‌కు చేరిన ఆస్ట్రేలియా.. సెమీస్‌లో పాక్ పై విజ‌యం.. భార‌త్‌లో అమీతుమీ

అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కంగారూ జట్టును ఓడించడం ద్వారా 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యువ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు. భారత్ నుంచి కెప్టెన్ ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్, సౌమీ పాండే వంటి ఆటగాళ్లు అద్బుతమైన ఫామ్ లో ఉన్నారు. ఫైనల్ లో భారత్ జట్టును గెలిపించే బాధ్యత ఈ ఆటగాళ్లపై ఉంది.

Also Read : Team India : మూడో టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. ఇక ఇంగ్లాండ్ ప‌ని ఈజీనే!

ఇప్పటి వరకు అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు సార్లు కూడా భారత్ జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడోసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ జట్టు ఈనెల 11న జరిగే అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ విజయం అవుతుంది. ఇంతకు ముందు 2012, 2018లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ లో ఇరు జట్లు తలపడ్డాయి. గత ప్రపంచ కప్ 2022లో ఇంగ్లండ్ ను ఓడించి భారత్ టైటిల్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

భారత్ జట్టు అండర్ -19 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఫైనల్స్ కు చేరింది. ఇందులో ఐదు సార్లు భారత్ జట్టు విజేతగా నిలిచింది. 2000 శ్రీలంకపై, 2008 దక్షిణాఫ్రికాపై, 2012 ఆస్ట్రేలియాపై, 2018 ఆస్ట్రేలియా జట్టుపై, 2022 ఇంగ్లాండ్ జట్టుపై భారత్ జట్టు విజేతగా నిలిచింది. ప్రస్తుతం తొమ్మిదో సారి భారత్ జట్టు అండర్ -19 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరింది.

ఆస్ట్రేలియా జట్టు అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఐదు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు (1998, 2002, 2010 సీజన్ లలో) టైటిల్స్ సాధించగా.. రెండు సార్లు ఓడిపోయింది. ఆ రెండు సార్లుకూడా భారత్ జట్టుపైనే కావటం గమనార్హం.