Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నోటీసులు
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృతస్థాయి నియోజవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడారు.
![Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నోటీసులు Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నోటీసులు](https://10tv.in/wp-content/uploads/2023/03/balkasuman.jpg)
balkasuman
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీచేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే విచారణకు రావాలని బాల్క సుమన్‌కు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృతస్థాయి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆ సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిని కొడతానంటూ ఆయన చెప్పు చూపించిన వీడియో ఇటీవల బాగా వైరల్ అయింది. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని అన్నారు. కేసు నమోదుకావడంతో బాల్క సుమన్ కనపడకుండా పోయారని ప్రచారం జరిగింది.
ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బాల్క సుమన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పెద్దపెల్లి, చెన్నూరు ప్రజలే బాల్క సుమన్‌కు బుద్ధి చెబుతారని మండిపడ్డారు.
Ram Mandir : రామ్‌లల్లాను దర్శించుకున్న సీఎం యోగి, యూపీ మంత్రులు, ఎమ్మెల్యేలు