Devara : ఒరే బాబు ‘దేవర’ స్టోరీ లీక్ చేసేలా ఉన్నాడు.. ‘దేవర’లో వాళ్లంతా ఫ్రెండ్స్.. జాన్వీ కపూర్ ఆయన కూతురు..

సలార్ సినిమాలో కనిపించిన నటుడు పులి రాజేందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా తాను దేవర సినిమాలో నటిస్తున్నాను అని చెప్పి దేవర గురించి మాట్లాడాడు.

Devara : ఒరే బాబు ‘దేవర’ స్టోరీ లీక్ చేసేలా ఉన్నాడు.. ‘దేవర’లో వాళ్లంతా ఫ్రెండ్స్.. జాన్వీ కపూర్ ఆయన కూతురు..

Actor Puli Rajendar tells about Jr NTR Devara Movie

Puli Rajendar : ఎన్టీఆర్(NTR) దేవర(Devara) సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల సలార్ సినిమాలో కనిపించిన నటుడు పులి రాజేందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా తాను దేవర సినిమాలో నటిస్తున్నాను అని చెప్పి దేవర గురించి మాట్లాడాడు. పులి రాజేందర్ దేవర గురించి మాట్లాడుతూ.. సినిమాలో నేను శ్రీకాంత్ గారి పక్కన ఉండే పాత్రలో నటిస్తున్నాను. సినిమాలో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్.. వీళ్లంతా కలిసి ఉంటారు ఫ్రెండ్స్ లాగా, జాన్వీ కపూర్ శ్రీకాంత్ కూతురు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకో ఇంటర్వ్యూలో సినిమా ఊహించని విధంగా ఉంటుందని, VFX అదిరిపోతాయని, 2024లో దేవర భారీ హిట్ కొడుతుందని, నేను ఇప్పటికే 50 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను అని తెలిపాడు.

దీంతో పులి రాజేందర్ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఒరే బాబు వదిలితే స్టోరీ మొత్తం చెప్పేలా ఉన్నావు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఇంటర్వ్యూ కొరటాల, ఎన్టీఆర్ చూస్తే పిలిచి తిడతారని కామెంట్స్ చేస్తున్నారు. పులి రాజేందర్ చెప్పినట్టు అందరూ ఫ్రెండ్స్ అయితే మధ్యలో గొడవలు వచ్చి రెండు వర్గాలుగా విడిపోతారని తెలుస్తుంది.

Also Read : Viral Video : ‘3 ఇడియట్స్’ మూవీ సీన్ రియల్ లైఫ్‌లో.. తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక ఇప్పటికే దేవర గ్లింప్స్ రిలీజ్ చేయగా అది చూసి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సముద్రపు ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్ర దొంగలు కథాంశంతో దేవర సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక దేవర పార్ట్ 1 సినిమా ఏప్రిల్ 5 రిలీజ్ అవుతుందని మొదట ప్రకటించారు కానీ ప్రస్తుతం వాయిదా పడుతుందని సమాచారం.