CM Jagan : ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడాలన్న జగన్

ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ..

CM Jagan : ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడాలన్న జగన్

CM Jagan

AP Education Department : ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత విధానం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అని అన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే.. మిగతా వళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని, ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నామని జగన్ అన్నారు.

Also Read : CM Jagan : యుద్ధానికి సిద్ధం కండి- వాలంటీర్లకు సీఎం జగన్ పిలుపు

మన పిల్లలు మంచి మంచి జీతాలతో మెరుగైన ఉద్యోగాలు సాధించాలని అది జరగాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యం అవుతుందని సీఎం జగన్ అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.. అప్పుడే మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.. ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చు అని, కానీ, ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిన అవసరం ఉందని జగన్ తెలిపారు. ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు.. ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చని, కానీ, మనం వేసిన ప్రతి అడుగుకూడా ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కూడా సమూలంగా మార్చుకుంటూ వస్తున్నామని చెప్పారు.

Also Read : APRCET-2024 Notification : ఏపీఆర్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 20 నుంచే దరఖాస్తులు ప్రారంభం

మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోందని, అందుకనే ప్రతి అడుగులోనూ చిత్తశుద్ది, అంకిత భావం చూపిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాంను ప్రవేశపెట్టామని, గ్లోబల్ సిటిజన్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పు రావాలని అన్నారు. అందుకే ఇంగ్లిష్ మీడియం నుంచి నాడు – నేడు, అమ్మఒడి, గోరుమద్దతో మన ప్రయాణం ప్రారంభమైందని, అక్కడితో మనం ఆగిపోలేదని జగన్ పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యార్థి ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని, ఐవీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేస్తున్నామని జగన్ అన్నారు. బైజూస్ కంటెంట్ తో అనుసంధానం చేశామని, ఈ ప్రయాణం, ఇక్కడితో ఆగిపోకూడదని, అత్యుతన్నత విద్యలో కూడా ఇలాంటి అడుగులు వేయాల్సిన అవసరాన్ని భావించి దానిపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.

Also Read : ప్రజలే కాదు నేనూ బాధితుడినే, సైకో పాలనలో అంతా విధ్వంసమే- సీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు

ఎడ్‌క్స్‌తో ఈరోజు చేసుకుంటున్న ఒప్పందం మరో అడుగు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 2వేలకుపైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్‌ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు. క్రెడిట్స్‌ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర అందుబాటులోలేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుందని, మన పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమేనని జగన్ అన్నారు. నాణ్యమైన విద్య వారికి అదించగలిగితే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. టాప్‌ -50 ర్యాంకింగ్స్‌లో ఉన్న 320 కాలేజీల్లో సీటు వస్తే.. రూ.1.2 కోట్ల వరకూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం జగన్ చెప్పారు.