కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని ఇవ్వాలని హైకోర్టును కోరాం.. అయితే..: శ్రీధర్ బాబు

సీబీఐ, ఈడీ విచారణ జరిపితే బీఆర్ఎస్, బీజేపీ ఒకటవుతాయన్న అనుమానం తమకు ఉందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని ఇవ్వాలని హైకోర్టును కోరాం.. అయితే..: శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మొదటి నుంచీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక దానిపై అన్ని వివరాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు మరిన్ని వివరాలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని ఇవ్వాలని హైకోర్టును కోరామని శ్రీధర్ బాబు చెప్పారు. జడ్జిలు తక్కువగా ఉన్నారని హైకోర్టు నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు. మళ్లీ లేఖ రాస్తామని వివరించారు. తమ మ్యానిఫెస్టోలో జ్యూడిషియల్ విచారణ చేయిస్తామని అని స్పష్టంగా చెప్పామని తెలిపారు.

ఒకవేళ కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయిస్తామని కేంద్ర సర్కారు చెబితే తాము వద్దని చెప్పబోమని శ్రీధర్ బాబు అన్నారు. వారు విచారణ జరిపించాలనుకుంటే సీబీఐ ఒకటే కాదని, ఈడీ, సీవీసీ కూడా ఉన్నాయని చెప్పారు. అయితే, వాటితో విచారణ చేస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటవుతాయన్న అనుమానం తమకు ఉందని తెలిపారు. గతంలో సిట్టింగ్ జడ్జితో పలు విచారణలు జరిగాయన్నారు.

Read Also: ఎన్నికల వేళ ఆ 370తో ఈ 370కి ముడిపెడుతూ మోదీ ఆసక్తికర కామెంట్స్