Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల భవిష్యత్ ఏంటి?

పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతోంది?

Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల భవిష్యత్ ఏంటి?

Lok Sabha Elections 2024- Telangana Political Scenario

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రెండు రోజుల క్రితం 9మంది అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందున్న బీజేపీ.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో ఎన్నికల రణరంగంలో కూడా దిగిపోయింది. ఇక వారం రోజుల ముందే మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. ఈ నెల 6న పాలమూరు కేంద్రంగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది. ఇక, ఈరోజు నలుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభలో కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతోంది.

రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు 14 చోట్ల గెలవాలని అధికార కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. అసెంబ్లీలో గెలుపు తర్వాత జరిగే ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తొలి పరీక్షగా నిలుస్తున్నాయి. ఇక కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి తెలంగాణలో ఈసారి మెజార్టీ సీట్లు గెలవడం అత్యంత కీలకం. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్న కమలదళం.. కర్నాటకతో పాటు తెలంగాణపై ప్రధానంగా ఫోకస్ చేసింది. కనీసం 10 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా దూకుడు పెంచుతోంది.

ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు జీవనర్మణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీ నుంచి వలసలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను దక్కించుకోవడమే బీఆర్ఎస్ కు సవాల్ గా మారుతోంది. దీంతో బీఆర్ఎస్ కూడా చావో రేవో అన్నట్లుగా కొట్లాడేందుకు రెడీ అవుతోంది.

మొత్తంగా రానున్న పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఇంతకీ రానున్న ఎన్నికల్లో తెలంగాణ ఎవరి వైపు నిలవబోతోంది? ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతోంది? ఇదే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అనాలసిస్..

Also Read : లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయబోయే నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్

పూర్తి వివరాలు..