PM Modi : కుటుంబ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ

రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ ఫుల్ పంచ్ లతో రెండు పార్టీలకు చెమట్లు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ.

PM Modi : కుటుంబ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ

PM Modi Slams BRS And Congress

PM Modi : తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఏకిపారేశారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. కాషాయ కార్యకర్తల్లో జోష్ నింపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. అబద్దాలు, దోపిడీ కాంగ్రెస్ నైజం అని మండిపడ్డారు ప్రధాని. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసిందని అటాక్ చేశారు మోదీ.

సోమవారం ఆదిలాబాద్ లో జరిగిన సభతో పాటు మంగళవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలోనూ విమర్శల దాడి పెంచారు ప్రధాని. రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ ఫుల్ పంచ్ లతో రెండు పార్టీలకు చెమట్లు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ.

కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు మోదీ. మీరు తిన్నారు, మేము కూడా తింటాము అన్నట్లుగా ఆ రెండు పార్టీల తీరు ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటిది ఒకే బాధ అని విమర్శించారు. జూట్, లూట్.. అబద్దాలు చెప్పడం, దోపిడీ చేసుకోవడం ఆ రెండు పార్టీలకు అలవాటే అన్నారు. బీఆర్ఎస్ పేరు మార్చుకున్నా తెలంగాణలో పరిస్థితి మాత్రం మారలేదన్నారు. బీఆర్ఎస్ స్థానంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కూడా ఏమీ మారబోదన్నారు.

బీఆర్ఎస్ అవినీతిని తట్టుకోలేక కాంగ్రెస్ ను తెచ్చుకున్నారని.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలే అని విమర్శించారు ప్రధాని మోదీ. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాళేశ్వరం కుంభకోణంతో తెలంగాణ ప్రజలను దోచుకుందని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఎక్కువ రోజులు సాగవని ప్రధాని మోదీ అన్నారు. మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేయడంతో పాటు ఎయిర్ స్ట్రైక్ కూడా చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ.

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల భవిష్యత్ ఏంటి?