Rohit Sharma : ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజ‌యం.. రోహిత్ శ‌ర్మ మూడు ప‌దాల పోస్ట్ వైర‌ల్‌..

ముంబై ఇండియ‌న్స్ మూడు వ‌రుస ఓట‌ముల త‌రువాత విజ‌యాన్ని అందుకున్న త‌రువాత మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Rohit Sharma : ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజ‌యం.. రోహిత్ శ‌ర్మ మూడు ప‌దాల పోస్ట్ వైర‌ల్‌..

Rohit Sharma Three Word Post Goes Viral After Mumbai Indians First win In IPL 2024

Rohit Sharma Post : ఐపీఎల్ 2024లో ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ ఓట‌ముల‌తో సీజ‌న్‌ను ప్రారంభించిన ముంబై ఆదివారం హోంగ్రౌండ్‌లో గెలుపు రుచి చూసింది. వాంఖ‌డే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 29 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల ఖాతాను తెరిచిన ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(27 బంతుల్లో 49), టీమ్‌డేవిడ్ (21 బంతుల్లో 45నాటాట్‌), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39) లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 71 నాటౌట్‌), పృథ్వీ షా (40 బంతుల్లో 66) పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు.

IPL 2024 Points Table : ముంబై అంటే అంతే మ‌రీ.. ఒక్క విజ‌యం.. పాయింట్ల ప‌ట్టిక‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు

ఈ సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించింది. అత‌డి స్థానంలో హార్థిక్ పాండ్య‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. మూడు వ‌రుస ఓట‌ముల త‌రువాత విజ‌యాన్ని అందుకున్న త‌రువాత మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ‘ఆఫ్ ది మార్క్‌’ అనే శీర్షిక‌తో కొన్ని ఫోటోల‌ను అత‌డు పంచుకున్నాడు.

కాగా.. 18వేల మంది చిన్నారులు వాంఖడే స్టేడియంలో కూర్చుని ముంబై, ఢిల్లీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను నేరుగా వీక్షించారు. వీరంతా ముంబై జెర్సీని ధ‌రించారు. వార్షిక ఈఎస్ఏ గేమ్ కోసం ఈ పిల్లలందరినీ ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ నీతా అంబానీ తరపున తీసుకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగం అయిన రిలయన్స్ ట్రస్ట్ ద్వారా అందరికీ విద్య అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో ప్రతి సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టు ఆడే (ESA Day) మ్యాచ్‌ని నిర్వహిస్తోంది.

Virat Kohli : కారు డోరు తెరిచేందుకు తంటాలు ప‌డ్డ కోహ్లి! వీడియో వైర‌ల్‌..

2010లో ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది పిల్లలకు జీవితాన్ని మార్చే అవకాశాలను అందిస్తోంది.