Virat Kohli : ఢిల్లీతో మ్యాచ్‌.. అరుదైన మైలురాయి ముంగిట విరాట్ కోహ్లి.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

కింగ్ కోహ్లి ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు.

Virat Kohli : ఢిల్లీతో మ్యాచ్‌.. అరుదైన మైలురాయి ముంగిట విరాట్ కోహ్లి.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

PIC Credit : ANI

Virat Kohli 250th IPL Match : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. తాజాగా కింగ్ కోహ్లి ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నేడు (శుక్ర‌వారం మే12న‌) త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బ‌రిలోకి దిగితే ఇది అత‌డికి 250 ఐపీఎల్ మ్యాచ్ కానుంది.

కోహ్లి కంటే ముందుగా మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ లు మాత్ర‌మే ఐపీఎల్‌లో 250 మ్యాచుల‌ను ఆడారు. అయితే.. ఈ ముగ్గురికి సాధ్యం కానీ ఓ రికార్డు విరాట్ కోహ్లి అందుకోనున్నాడు. ఐపీఎల్‌లో ఒకే ప్రాంఛైజీ త‌రుపున 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ 2008 నుంచి కోహ్లి ఆర్‌సీబీ త‌రుపునే ఆడుతున్నాడు.

Hardhik Pandya : వ‌రుస ఓట‌ముల‌పై హార్దిక్ పాండ్య వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

చెన్నై పై నిషేదం ప‌డిన స‌మ‌యంలో ధోని పుణె జెయింట్స్ త‌రుపున ఆడగా, ఇప్పుడు ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ల‌లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్ త‌రుపున ఆడాడు. ఇక దినేశ్ కార్తీక్ విష‌యానికి వస్తే.. కేకేఆర్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ , ఆర్‌సీబీ జ‌ట్ల‌కు ఆడాడు.

ఆర్‌సీబీ తరపున ఇప్పటి వరకు కోహ్లి 249 మ్యాచ్‌లు ఆడాడు. 241 ఇన్నింగ్స్‌ల్లో బ‌రిలోకి దిగాడు. 131.6 స్ట్రైక్‌రేటుతో 38.7 స‌గ‌టుతో 7897 ప‌రుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచ‌రీలు, 55 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచులు ఆడిన ఆట‌గాళ్లు..
– మహేంద్ర సింగ్ ధోనీ (262),
– రోహిత్ శర్మ (256)
– దినేష్ కార్తీక్ (254)
– విరాట్ కోహ్లి (249)
– ర‌వీంగ్ర జ‌డేజా (238)

Rohit Sharma : కోల్‌క‌తా డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ముంబైని వీడ‌డం ఖాయ‌మైన‌ట్లేనా?