Adhyanth Harsha : న్యూరో సైన్స్‌లో PHD చేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాల్లోకి..

తాజాగా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష మీడియాతో మాట్లాడారు.

Adhyanth Harsha : న్యూరో సైన్స్‌లో PHD చేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాల్లోకి..

Director Adhyanth Harsha talks about Varun Sandesh Viraaji Movie

Adhyanth Harsha : వరుణ్ సందేశ్ ఇటీవల కొంచెం గ్యాప్ తర్వాత నింద సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. త్వరలో ‘విరాజి’ సినిమాతో రాబోతున్నాడు. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా విరాజి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష మీడియాతో మాట్లాడారు.

డైరెక్టర్ ఆద్యంత్ హర్ష తన గురించి చెప్తూ.. నేను తిరుపతిలో బయోటెక్నాలజీలో బీటెక్ చేసి ఆ తర్వాత ఫారిన్ లో బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్‌డీ ఇన్ న్యూరో సైన్స్ చేశాను. అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ కూడా చేశాను. ఆ తర్వాత కొన్ని కథలు రాసుకొని డైరెక్టర్ అవ్వాలని ఇండియాకు వచ్చాను. మొదట మూడు షార్ట్ ఫిలిమ్స్, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసాను. ఆ సినిమా నచ్చి ఒకరు రెండు లక్షల రూపాయలకు కొనుక్కోవడంతో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ‘విరాజి’ కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు చెప్పగా ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం చేయడంతో నా కథ ఇలా పట్టాలెక్కింది అని తెలిపారు.

Also Read : NTR – Allu Sirish : ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పిన అల్లు శిరీష్.. వాళ్ళని కూడా కౌగలించుకొని..

వరుణ్ సందేశ్ గురించి చెప్తూ.. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు యాండీ. ఆ పాత్రకు వరుణ్ యూఎస్ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని వరుణ్ ని తీసుకున్నామని తెలిపారు. వరుణ్ కి కథ చెప్పాక నచ్చి చేద్దామన్నారు. ఈ సినిమాలో యాండీ క్యారెక్టర్ బాగా రిచ్. దానికి తగ్గట్టు తలకు రంగు, చెవికి పోగు, టాటూలు, సిగరెట్.. ఇలా అన్ని లుక్ కనపడేలా వరుణ్ చాలానే కష్టపడ్డారు. సినిమా చూసాక వరుణ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా నాకు, మీకు లైఫ్ ఇస్తుందని చెప్పినట్టు తెలిపారు.

ఇక విరాజి సినిమా గురించి మాట్లాడుతూ.. ఆరు నెలలు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ చేసాము. సినిమాలో ప్రతి షాట్, ఆ షాట్ లో వాడే ప్రతి వస్తువు రాసుకున్నాము. విరాజి కథ సింపుల్ గా చెప్పాలంటే ఓ పది మంది ఓ కొండమీదకు మూసేసిన పిచ్చాసుపత్రికి వెళ్తారు. వాళ్లు బయటకు వచ్చి చూస్తే వాళ్ల కారు ఉండదు, మొబైల్ లో సిగ్నల్స్ ఉండవు. ఆ టైమ్ లో యాండీ అనే వ్యక్తి వాళ్లకు పరిచయం అవుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అని హారర్ థ్రిల్లర్ గా చూపించాము. 4 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసాం. విరాజి అంటే చీకట్లో వెలుగులు పంచేవాడు. అలాగే సొసైటీలో ఉన్న ఓ ఇష్యూని కూడా చూపించాము అని చెప్పారు.