హైదరాబాద్లో భారీగా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం
భారీ యంత్రంతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తున్నారు. మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని కూల్చేస్తున్నారు.
![హైదరాబాద్లో భారీగా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం హైదరాబాద్లో భారీగా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం](https://10tv.in/wp-content/uploads/2024/08/Illegal-Constructions.jpg)
HYDRA : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో హైడ్రా ఆధ్వర్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఎఫ్ టీఎల్ ల్యాండ్ లో అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలను హైడ్రా అధికారులు గుర్తించారు.
శనివారం ఉదయం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు మొదలు పెట్టారు. అర్థరాత్రి వరకు కూల్చివేతలను కొనసాగించింది. ఆ తర్వాత ఉదయం భారీ యంత్రంతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తున్నారు. మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని భారీ యంత్రంతో అధికారులు కూల్చేస్తున్నారు.