Chiranjeevi – Balakrishna : ఏకంగా 11వ సారి చిరంజీవి – బాలకృష్ణ సంక్రాంతి పోటీ.. విశ్వంభర వర్సెస్ NBK 109..?

సంక్రాతికి ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే.

Chiranjeevi – Balakrishna : ఏకంగా 11వ సారి చిరంజీవి – బాలకృష్ణ సంక్రాంతి పోటీ.. విశ్వంభర వర్సెస్ NBK 109..?

Chiranjeevi and Balakrishna Clash at Box office for 2025 Sankranthi with Vishwambhara and NBK 109 Movies

Chiranjeevi – Balakrishna : టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఇద్దరే. అభిమానులు – సినిమాలు – రికార్డులు అన్ని విషయాల్లోనూ ఒకరితో ఒకరికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఈ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులకు పండగే. థియేటర్స్ వద్ద రచ్చ చేయాల్సిందే. అయితే వీరిద్దరూ చాలా సార్లు పోటీపడ్డారు. ఒకేసారి సినిమాలు రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ సృష్టించారు. ముఖ్యంగా సంక్రాతికి ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే.

సినిమాలకు సంక్రాంతి సీజన్ చాలా ముఖ్యం. అందుకే స్టార్ హీరోలు, పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతిని టార్గెట్ చేసుకొని దిగుతాయి. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా సంక్రాంతి హాలిడేస్ పుణ్యమా అని కలెక్షన్స్ అయితే వస్తాయి. అయితే వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి బాలకృష్ణ మరోసారి పోటీపడనున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. 2025 జనవరి 10న విశ్వంభర సినిమా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు అదే సమయానికి బాలకృష్ణ సినిమా కూడా రిలీజ్ కాబోతుందని సమాచారం. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమా తెరకెక్కిస్తున్నారు. ముందుగా దసరాకి ఈ సినిమా రిలీజ్ అనుకున్నా ఏపీ ఎన్నికల వల్ల బాలయ్య డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది. దీంతో బాలయ్య NBK109 సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతుందని టాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే మరోసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ – చిరంజీవి వార్ తప్పదు.

Also Read : Chiranjeevi : చిరంజీవిని పట్టుకున్న నటుడు.. చెయ్యి తీసేయమన్న అసిస్టెంట్.. పర్లేదు వేసుకో అని చిరు.. వీడియో వైరల్..

ఇప్పటికే బాలకృష్ణ – చిరంజీవి సంక్రాంతికి 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు విశ్వంభర – NBK109 సినిమాలతో 11వ సారి అవుతుంది. మొదటిసారి 1985లో బాలకృష్ణ ఆత్మబలం – చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాలు పోటీ పడ్డాయి. ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగ రాముడు – బాలకృష్ణ భార్గవ రాముడు సినిమాలు, 1988లో చిరంజీవి మంచి దొంగ – బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు, 1997లో చిరంజీవి హిట్లర్ – బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాలు, 1999లో చిరంజీవి స్నేహం కోసం – బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాలు, 2000లో బాలకృష్ణ వంశోద్ధారకుడు – చిరంజీవి అన్నయ్య సినిమాలు, 2001లో బాలకృష్ణ నరసింహనాయుడు – చిరంజీవి మృగరాజు సినిమాలు, 2004లో బాలకృష్ణ లక్ష్మీనరసింహ – చిరంజీవి అంజి సినిమాలు, 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 – బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు పోటీ పడ్డాయి. ఇటీవల 2023లో ముచ్చటగా పదోసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య – బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ ఇద్దరూ ఫిక్స్ అయితే 11వ సారి పోటీ పడనున్నట్టే.