సర్వేచేసి హద్దులు పెట్టండి.. ఆక్రమించినట్లు తేలితే నేనే కూల్చేస్తా : పల్లా రాజేశ్వర్ రెడ్డి

మా భవనాలు ప్రభుత్వ భూమి, చెరువు భూమిని ఒక్క ఇంచు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలినా హైడ్రా బుల్డోజర్లతోనే వారి సమక్షంలోనే భవనాలను ..

సర్వేచేసి హద్దులు పెట్టండి.. ఆక్రమించినట్లు తేలితే నేనే కూల్చేస్తా : పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy : హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ల భవనాలపై ఫిర్యాదు రావడం చర్చనీయాంశమైంది. ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ ఏఈఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో హైడ్రా బృందం పల్లా రాజేశ్వర్ రెడ్డి నాదం చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన భవనాలను కూల్చి వేసేందుకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది.. అక్రమంగా కేసులు పెడుతున్నారు : హరీశ్ రావు

25ఏళ్ల క్రితం విద్యా సంస్థలు మొదలు పెట్టాము. తొమ్మిది నెలలుగా నాపై వేధింపులు పెరుగుతున్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మేము ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. మెడికల్ కళాశాల కూలుస్తామని భయపెడుతున్నారు. నీటి పారుదల శాఖ అనుమతితో భవనాలు నిర్మాణం చేశామని పల్లా చెప్పారు. నా భూమిలో మాత్రమే నేను నిర్మాణాలు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం చెరువు, ప్రభుత్వ భూములకు సర్వే చేసి హద్దు పెట్టాలని రాజేశ్వర్ రెడ్డి కోరారు.

Also Read : ఇక తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్..! అందుకోసం కేసీఆర్ వ్యూహం ఏంటి?

మా భవనాలు ప్రభుత్వ భూమి, చెరువు భూమిని ఒక్క ఇంచు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలినా హైడ్రా బుల్డోజర్లతోనే వారి సమక్షంలోనే భవనాలను దగ్గరుండి నేను కూల్చివేయిస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఎక్కడైనా తప్పు జరిగితే నోటీసులు ఇవ్వండి.. మా అనుమతులు కూడా పరిశీలించండి. ఆ తరువాత నేను తప్పుచేసినట్లు తేలితే నేను బాధ్యత వహిస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.