టీటీడీలో ప్రకంపనలు.. మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు నోటీసులు

గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.

టీటీడీలో ప్రకంపనలు.. మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు నోటీసులు

TTD Vigilance Notices : తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ నోటీసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు స్టేట్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు మాజీ ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి.. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీలకు నోటీసులు పంపారు.

శ్రీవారి ట్రస్ట్ నిధులను ఆలయాల నిర్మాణాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించారనే ఆరోపణలపై నోటీసులు ఇచ్చారు అధికారులు. గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. అలాగే మాజీ ఈవో ధర్మారెడ్డి బర్డ్ డైరెక్టర్ గా ఉండటం అంశంపైనా విచారణ చేపట్టారు విజిలెన్స్ అధికారులు.

గత 2 నెలలుగా టీటీడీలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. అన్ని విభాగాల్లో గత ఐదేళ్లలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి అన్న దానిపై విచారణ జరుపుతోంది. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం.