Asian Champions Trophy : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ఎంపిక

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పత‌కం గెలిచి మంచి జోష్‌లో ఉంది భార‌త పురుషుల హాకీ జ‌ట్టు.

Asian Champions Trophy : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ఎంపిక

India Hockey announces squad for Asian Champions Trophy

Asian Champions Trophy : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పత‌కం గెలిచి మంచి జోష్‌లో ఉంది భార‌త పురుషుల హాకీ జ‌ట్టు. ఇదే ఉత్సాహంలో మ‌రో టోర్నీకి స‌న్న‌ద్ధం అవుతోంది. ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. చైనాలో సెప్టెంబ‌ర్ 8 నుంచి 17 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు.

కీల‌క ఆట‌గాళ్లు అయిన మ‌న్‌దీప్ సింగ్‌, ల‌లిత్ ఉపాధ్యాయ‌, హార్దిక్ సింగ్‌ల‌కు విశ్రాంతి ఇచ్చారు. స్టార్ గోల్ కీప‌ర్ శ్రీజేత్ పారిస్ ఒలింపిక్స్ అనంత‌రం ఆట‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో క్రిష‌న్ బ‌హ‌దూర్ పాఠ‌క్‌, సూర‌జ్ క‌ర్రేరా ల‌ను గోల్ కీప‌ర్‌లుగా ఎంపిక చేశారు. మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌తో పాటు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు చోటు ఇచ్చారు. ఇందులో పారిస్ ఒలింపిక్స్ ఆడిన వారిలో 10 మందికి చోటు ద‌క్కింది.

Jay Shah : ఐసీసీ ఛైర్మ‌న్‌గా జైషా.. టీమ్ఇండియా క్రికెట‌ర్ల శుభాకాంక్ష‌ల వెల్లువ‌

హర్మన్‌ప్రీత్‌ సింగ్ సార‌థ్యంలోనే భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ టోర్నీలో భారత్‌తో సహా అగ్రశ్రేణి ఆసియా జట్లు పాల్గొంటాయి. కొరియా, మలేషియా, పాకిస్తాన్, జపాన్ ల‌తో పాటు ఆతిథ్య చైనా లు పోటీ ప‌డ‌నున్నాయి.

భారత జట్టు..

గోల్‌ కీపర్స్‌: క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా
డిఫెండర్స్‌: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్‌ సింగ్ (కెప్టెన్‌), జుగ్‌రాజ్ సింగ్, సంజయ్‌, సుమిత్.
మిడ్‌ ఫీల్డర్స్‌: రాజ్‌ కుమార్‌ పాల్, నీలకంఠ శర్మ, వివేక్‌ సాగ్‌ ప్రసాద్‌ (వైస్ కెప్టెన్), మ‌న్ ప్రీత్ సింగ్‌, మహ్మద్ రహీల్ మౌసీన్.
ఫార్వర్డ్స్‌: అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, అరైజీత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.

Zaheer Khan : ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్‌గా జ‌హీర్ ఖాన్.. ఎల్ఎస్‌జీ ద‌శ తిరిగేనా..?