Pawan – Chiru – Charan : పవన్ కళ్యాణ్ కి చిరు, చరణ్,బన్నీ స్పెషల్ బర్త్ డే విషెష్.. చిరు పాత ఫోటో షేర్ చేసి..

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కోసం, చిరు తనయుడు రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ గా విషెస్ షేర్ చేసారు.

Pawan – Chiru – Charan : పవన్ కళ్యాణ్ కి చిరు, చరణ్,బన్నీ స్పెషల్ బర్త్ డే విషెష్.. చిరు పాత ఫోటో షేర్ చేసి..

Megastar Chiranjeevi and Ram Charan Special Birthday Wishes to Pawan Kalyan

Pawan – Chiru – Charan : నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లతో పాటు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈసారి పవన్ డిప్యూటీ సీఎం కావడంతో పుట్టిన రోజు హంగామా మరింత ఎక్కువ చేస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కోసం, చిరు తనయుడు రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ గా విషెస్ షేర్ చేసారు.

Also Read : Jr NTR : పంచెకట్టుతో ఎన్టీఆర్.. ఫ్యామిలీలతో కలిసి ఆలయంలో ఎన్టీఆర్, నీల్, రిషబ్..

చిరంజీవి పవన్ కళ్యాణ్, సురేఖతో కలిసి దిగిన పాత ఫోటో షేర్ చేసి.. కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.

ఇక రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీ నీతి, నిజాయితీ, నిబద్దత నన్ను ఎప్పుడూ ప్రేరిపిస్తాయి. మీ నిస్వార్థ చర్యలు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించడం, ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావం, ఆంద్రప్రదేశ్‌లో అణగారిన వర్గాల జీవితాల కోసం మీరు చేసే కృషి స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు ఇదే బలాన్ని మరింత ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు. దీంతో చిరంజీవి, చరణ్ పవన్ కళ్యాణ్ కి చెప్పిన స్పెషల్ బర్త్ డే విషెస్ వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపాడు.