Yuvraj Singh : ధోనిని ఎన్న‌టికి క్ష‌మించ‌ను.. యువీ కెరీర్‌ను నాశ‌నం చేశాడు.. భారత రత్న ఇవ్వాల్సిందే..

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Yuvraj Singh : ధోనిని ఎన్న‌టికి క్ష‌మించ‌ను.. యువీ కెరీర్‌ను నాశ‌నం చేశాడు.. భారత రత్న ఇవ్వాల్సిందే..

Yuvraj Singh deserves Bharat Ratna MS Dhoni ruined his career says Yograj

Yuvraj Singh father : టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. భార‌త జ‌ట్టు 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వడంలో యువీ కీల‌క పాత్ర పోషించాడు. అటు బ్యాటు ఇటు బంతితో రాణించి జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల‌ను అందించాడు. ఇక భార‌త క్రికెట్‌కు యువ‌రాజ్ సింగ్ చేసిన సేవ‌ల‌కు గాను అత‌డు భార‌త ర‌త్న‌కు అర్హుడ‌ని యువీ తండ్రి, ప్ర‌ముఖ కోచ్ మోగ్‌రాజ్ సింగ్ తెలిపారు. అదే స‌మ‌యంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై ఆయ‌న విరుచుకుప‌డ్డాడు. యువీ కెరీర్‌ను ధోని నాశనం చేశాడ‌ని ఆరోపించాడు.

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని భార‌త జ‌ట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీలు అత‌డి నాయ‌క‌త్వంలోనే భార‌త్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో కోట్లాది మంది అభిమానుల‌ను ధోని సొంతం చేసుకున్నాడు. అత‌డు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి నాలుగేళ్లు దాటినా కూడా ఇప్ప‌టికి అత‌డి ఫ్యాన్‌ ఫాలోయింగ్ త‌గ్గ‌లేదు స‌రిక‌దా మ‌రింత పెరిగింది. ఈ క్ర‌మంలో యువీ తండ్రి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

Nicholas Pooran : గేల్ ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు.. సిక్స‌ర్ల కింగ్ నికోల‌స్ పూర‌న్‌..

2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు గెల‌వ‌డంలో యువీ కీల‌క పాత్ర పోషించాడు. అయిన‌ప్ప‌టికి కూడా అత‌డికి త‌గిన గుర్తింపు ద‌క్క‌లేద‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయం. 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో యువీ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఓ వైపు క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూనే మ‌రోవైపు మైదానంలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి జ‌ట్టు కప్పు గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌రువాత క్యాన్స‌ర్‌కు చికిత్స తీసుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు యువీ.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యోగ‌రాజ్ మాట్లాడుతూ.. ధోనిని తానెప్పుడు క్ష‌మించ‌న‌ని చెప్పాడు. అత‌డు ప్ర‌ముఖ క్రికెట‌రే కావొచ్చు అయిన‌ప్ప‌టికి అత‌డు నా కుమారుడు యువీకి అన్యాయం చేశాడ‌ని ఆరోపించాడు. ప్ర‌స్తుతం ప్ర‌తిదీ వెలుగులోకి వ‌స్తుంద‌న్నారు. మ‌రో నాలుగైదేళ్లు త‌న కుమారుడు ఆడే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ అత‌డి కెరీర్‌ను ధోని నాశ‌నం చేశాడ‌న్నారు.

AUS vs IND : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. మైండ్ గేమ్స్ మొద‌లు.. పాపం స్టీవ్‌స్మిత్‌..

అత‌డు ఓ సారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని సూచించాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, గౌత‌మ్ గంభీర్ లు కూడా మ‌రో యువ‌రాజ్ రాడ‌ని అన్నార‌ని గుర్తు చేసుకున్నాడు. క్యాన‌ర్స్‌తో పోరాడుతూనే దేశం కోసం ఆడి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిపించినందుకు భార‌త ప్ర‌భుత్వం యువీకి భార‌త ర‌త్న ఇవ్వాలని మోగ్‌రాజ్ అన్నారు.