Devara third single : దేవ‌ర మూడో పాట వ‌చ్చేసింది.. స్టెప్పుల‌తో పూన‌కాలు తెప్పించిన ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న మూవీ 'దేవ‌ర‌'.

Devara third single : దేవ‌ర మూడో పాట వ‌చ్చేసింది.. స్టెప్పుల‌తో పూన‌కాలు తెప్పించిన ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌

NTR Devara third single daavudi video song released

Devara third single : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న మూవీ ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీక‌పూర్ క‌థానాయిక‌. సెప్టెంబ‌ర్ 27 ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు పాట‌లు అంచ‌నాల‌ను పెంచ‌గా తాజాగా మూడో పాటను విడుద‌ల చేసింది.

‘కొర‌మీనా నిన్ను కోసుకుంటా ఈయాలా..’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ డ్యూయెట్ సాంగ్ ఫుల్ ఫాస్ట్ బీస్ట్‌తో ఉంది. ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌ల స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఈ పాట‌కు రామ‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా తెలుగులో న‌కాష్ అజీస్‌, అక్ష ఆల‌పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

Ram Charan : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళం

ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా న‌టిస్తున్నారు. బాబీ డియోల్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్, శృతి మరాథే లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.