NTR : చేతికి గాయం అయి, నొప్పి ఉన్నా ఆ స్టెప్స్ ఎలా చేసావ్ బ్రో.. సినిమా, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్..

ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట.

NTR : చేతికి గాయం అయి, నొప్పి ఉన్నా ఆ స్టెప్స్ ఎలా చేసావ్ బ్రో.. సినిమా, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్..

Jr NTR Danced for Davudi Song in Devara Even he Injured and Having Pain

Jr NTR : ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి నిన్న దావూది అంటూ మూడో సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కోసం ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేసేసారు మూవీ యూనిట్. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా స్టెప్పులు అదరగొట్టేసారు. దీంతో ఈ సాంగ్ వీడియో నిన్నటినుంచి ట్రేండింగ్ లో ఉంది.

Also Read : Mokshagna – Prasanth Varma : మోక్షజ్ఞ కొత్త సినిమా టైటిల్ ఇదేనా? పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ..

ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట. దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సాంగ్ రిలీజయ్యాక ఒక ట్వీట్ చేసాడు. తన ట్వీట్ లో.. గాయం అయినప్పటికీ. కండరాల నొప్పులు ఉన్నప్పటికీ ఇంత మాసీ సాంగ్ ని స్టైలిష్ గా చేసాడు ఎన్టీఆర్. అతని డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని తెలిపారు.

 

దీంతో ఈ పాట షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయినా కండరాల నొప్పులు ఉన్నా అవి భరిస్తూనే సినిమా కోసం, ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు ఎక్కడా గ్రేస్ తగ్గకుండా వేశాడు అని తెలుస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు.