Paralympics 2024 : ప్రతిభకుతోడు అదృష్టం కలిసొచ్చింది.. జావెలిన్‌లో సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ విభాగంలో భారత పారా అథ్లెట్ నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు.

Paralympics 2024 : ప్రతిభకుతోడు అదృష్టం కలిసొచ్చింది.. జావెలిన్‌లో సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Navdeep

Paralympics 2024 : పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ విభాగంలో భారత పారా అథ్లెట్ నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు. పారిస్ పారిలింపిక్స్ లో భారత్ కు ఇది 7వ స్వర్ణం. జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో నవదీప్ స్వర్ణం సాధించాడు. టోక్యోలో ఒలింపిక్స్ లో అతను కోల్పోయిన పతకాన్ని గెలుచుకున్నాడు

Also Read : Paralympics : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం..

జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో నవదీప్ 47.32 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. అంతకుముందు నవదీప్ రన్నరప్ గా నిలిచాడు. ఇదే విభాగంలో ఇరాన్ కు చెందిన అథ్లెట్ సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. అయితే, అతను రెండు పసుపు కార్డులు అందుకున్నందుకు అనర్హుడయ్యాడు. అనూహ్యంగా అతనిపై వేటు పడటంతో.. ఆ తరువాత స్థానంలో రన్నరప్ గా నిలిచిన నవదీప్ సింగ్ రజత పతకం కాస్తా స్వర్ణంగా మారింది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్ గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.

Also Read : Rishabh Pant : దులీప్ ట్రోఫీలో రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైర‌ల్‌

నవదీప్ 2016లో నీరజ్ చోప్రాను చూసిన తరువాత తన కెరీర్ ను ప్రారంభించాడు. 2017లో దుబాయ్ లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్ లో స్వర్ణం సాధించాడు. నవదీప్ 2020 టోక్యో ఒలింపిక్స్ లో నాల్గో స్థానంలో నిలిచాడు. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం గెలుచుకోవడం ద్వారా నవదీప్ 2024 పారిస్ పారాలింపిక్స్ కు అర్హత సాధించాడు.
పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారత్ ఇది 17వ పతకం. పారిస్ పారిలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలతో మొత్తం 29 పతకాలు సాధించింది. దీంతో పతకాల జాబితాలో భారత్ 16వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో చైనా నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రిటన్, అమెరికా కొనసాగుతున్నాయి.