ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2,412 పాజిటివ్ కేసులు

  • Published By: sreehari ,Published On : July 15, 2020 / 04:16 PM IST
ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2,412 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. 22, 197 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో 2,412 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 805 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు.

కోవిడ్ సోకిన వారిలో ఐదుగురు అనంతపూర్ నుంచి తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, కర్నూలులో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు మరణించారు.

ఇక విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 12, 17,963 మంది నుంచి శాంపిల్స్ పరీక్షించినట్టు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో 14,059 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా.. 2,562 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 16, 221 మంది ప్రస్తుతం ఏపీలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు.