సికింద్రాబాద్ నుంచి 3 ప్రైవేట్ రైళ్లు..తిరుపతి,విజయవాడ నుంచి కూడా

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2019 / 02:26 AM IST
సికింద్రాబాద్ నుంచి 3 ప్రైవేట్ రైళ్లు..తిరుపతి,విజయవాడ నుంచి కూడా

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట్ ప్యాసింజర్ ట్రైన్ కి సంబంధించిన ఆరపేషనల్ ఇష్యూస్ పై చర్చించడానికి రైల్వే బోర్డు శుక్రవారం సమావేశమైంది. 

తమ వంద రోజుల యాక్షన్ ఫ్లాన్ లో భాగంగా రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించాలనే లక్ష్యంతో దేశంలో వంద ప్రైవేటు రైళ్లు నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దేశంలో వంద ప్రైవేటు రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఆదాయం ఎక్కువగా వచ్చే మార్గాల్లో ఈ ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మూడు రైళ్లు విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు ప్రైవేటురైలు సర్వీసులు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను కలుపుతూ అధునాతన సౌకర్యాలతో ప్రైవేటు రైళ్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లను ఎంపిక చేయనున్నారు.