Ap Global Investors Summit: జీఐఎస్ అతిథులకు నోరూరించే వంటలతో విందు.. మెనూ ఇదే

దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న దృష్యా అందరి కోసం అన్ని రకాల వంటల్ని సిద్ధం చేయిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. రెండు రోజులపాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ వంటివి అందించనున్నారు. ఇందుకోసం వేదిక ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Ap Global Investors Summit: జీఐఎస్ అతిథులకు నోరూరించే వంటలతో విందు.. మెనూ ఇదే

Ap Global Investors Summit: విశాఖ వేదికగా జరుగుతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో అతిథుల కోసం అధికారులు అద్భుతమైన రుచులతో వంటలు సిద్ధం చేశారు. దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న దృష్యా అందరి కోసం అన్ని రకాల వంటల్ని సిద్ధం చేయిస్తున్నారు.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. రెండు రోజులపాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ వంటివి అందించనున్నారు. ఇందుకోసం వేదిక ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో టమాటా బాత్, ఇడ్లీ, వడ, హాట్‌ పొంగల్, ప్లమ్‌ కేక్, డ్రై కేక్, వెజ్‌ బుల్లెట్స్, మఫిన్స్, స్ప్రింగ్‌ రోల్స్, టీ, కాఫీ, సాయంత్రం శ్నాక్స్‌లో టీ, కాఫీతో పాటు కుకీస్, చీజ్‌ బాల్స్, డ్రై ఫ్రూట్‌ కేక్, ఫ్రూట్‌ కేక్, కట్‌ మిర్చి బజ్జీ వంటివి ఉంటాయి. శుక్రవారం రోజు నాన్ వెజ్‌లో భాగంగా బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, ప్రాన్స్ మసాలా, మటన్‌ కర్రీ, చికెన్‌ పలావ్ సిద్ధం చేస్తున్నారు.

Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

వెజ్‌ ఐటమ్స్‌లో ఆలూ గార్లిక్‌ ఫ్రై, క్యాబేజీ మటర్‌ ఫ్రై, పుట్టగొడుగులు, క్యాప్సికం, వెజ్‌ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్‌ బటర్‌ మసాలా, గోబీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, టమాటా పప్పు, బీట్‌రూట్‌ రసం, మెంతికూర–కార్న్‌ రైస్, మిర్చి కా సలాన్, మజ్జిగ పులుసు, ద్రాక్ష పండ్ల పచ్చడి, ఊర మిరపకాయ ఉంటాయి. డెజర్ట్స్, స్వీట్స్‌లో భాగంగా కట్‌ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను, చంద్రకాంత వంటి వాటిని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు.

శనివారం రోజు మధ్యాహ్న భోజనంలో నాన్‌ వెజ్‌ రకాల్లో ప్రాన్స్ కర్రీ, ఎగ్‌ మసాలా, ఆంధ్రా చికెన్‌ కర్రీ, చేపల వేపుడు, క్యారెట్‌ బీన్స్‌- కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, గోంగూర, మటన్‌ పలావ్‌, వెజ్‌ ఐటమ్స్‌లో కరివేపాకు రైస్, కడాయ్‌ పన్నీర్, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, వెజ్‌ బిర్యానీ, మజ్జిగ పులుసు, పప్పుచారు, మిరియాల రసం, ఉలవచారు, ఐస్ క్రీం వంటివి ఉన్నాయి. వీటితోపాటు రష్యన్‌ సలాడ్స్, వెజ్‌ సలాడ్‌, రుమాలి రోటీ, బటర్‌ నాన్‌ వంటివి ఉంటాయి. ఇంకా డెజర్ట్స్, స్వీట్స్‌ విభాగంలో బ్రౌనీ, గులాబ్‌జామ్, అంగూర్‌ బాసుంది, కట్ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, డబుల్‌ కా మీఠా చేయిస్తున్నారు.